నిమ్మరసం vs తేెనె నీరు.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

Published : Aug 27, 2025, 06:31 PM IST

బరువు తగ్గడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా నిమ్మరసం, హనీ వాటర్ తాగుతుంటారు. కానీ ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది? ఏది ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
14
బరువు తగ్గించే చిట్కాలు

ఆరోగ్యంగా ఉండాలంటే బరువు నియంత్రణలో ఉండటం చాలా అవసరం. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, షుగర్, రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. అయితే బరువు తగ్గడానికి ఎక్కువమంది లెమెన్ వాటర్, హనీ వాటర్ తాగుతుంటారు. కానీ ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిదో? ఈ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.  

24
తేనె నీటి ప్రయోజనాలు :

తేనెలో ఉండే సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగితే కడుపు ప్రశాంతంగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తేనెలో సహజంగా బాక్టీరియా నిరోధక, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి. తేనె నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

34
నిమ్మరసం ప్రయోజనాలు :

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడానికి తోడ్పడుతుంది. నిమ్మకాయలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది మంచి ఎంపిక.

44
బరువు తగ్గడానికి ఏది మంచిది?

నిపుణుల ప్రకారం.. నిమ్మరసం, తేనె నీరు రెండూ నేరుగా బరువు తగ్గడానికి సహాయపడవు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం, రోజువారీ వ్యాయామంతో పాటు ఈ డ్రింక్స్ తాగడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఈ రెండు డ్రింక్స్  ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. కాబట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు. లేదా రెండింటినీ కలిపి కూడా తీసుకోవచ్చు. 

గమనిక : 

డయాబెటిస్ ఉన్నవారు లేదా డయాబెటిస్ మందులు వేసుకునేవారు తేనె నీటిని తాగకపోవడమే మంచిది. తేనె ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. నిమ్మరసం ఎక్కువగా తాగితే దంతాల ఎనామిల్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సరైన మోతాదులో తీసుకోవడం ఉత్తమం.  

Read more Photos on
click me!

Recommended Stories