40 ఏండ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే

Published : Aug 28, 2025, 08:46 PM IST

ఈ రోజుల్లో గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా 30, 40 ఏండ్లలోనే గుండె జబ్బులు వస్తున్నాయి. అందుకే 40 ఏండ్లు దాటిన తర్వాత గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
గుండె ఆరోగ్యం

అనారోగ్యకరమైన ఆహారపు అలనవాట్లు, చెడు జీవనశైలి వంటి కారణాల వల్ల చాలా మంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా యువతకు కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, జీవనశైలి వంటి కారణాల వల్ల గుండె జబ్బులు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొన్ని చిట్కాలను పాటిస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇందుకోసం రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి.దీనివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగదు. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. ఇవన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

నిపుణుల ప్రకారం.. కొన్ని వ్యాయామాలను చేస్తే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

25
వాకింగ్

వాకింగ్ ఎవ్వరైనా చేయొచ్చు. ఇది అన్ని వ్యయామాల్లో చాలా సులభమైనదే అయినా చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు గనుకు ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాలు గనుక నడిస్తే మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే హార్ట్ సమస్యలకు దారితీసే ఒత్తిడి కూడా తగ్గుతుంది. 

35
సైక్లింగ్

సైక్లింగ్ మన గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యాయామం వల్ల గుండె కండరాలు, కాళ్ల కండరాలు బలంగా అవుతాయి. అలాగే మోకాళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. ఇవన్నీ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 

45
స్విమ్మింగ్

స్విమ్మింగ్ మన శరీరానికి మంచి మేలు చేసే వ్యాయామం. ఇది మన గుండెనే కాదు ఊపిరితిత్తులను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే స్విమ్మింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

55
మెట్లు ఎక్కడం

చాలా మంది మెట్లు ఎక్కడానికి ఇష్టపడరు. కానీ మెట్లను ఎక్కడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం.. మెట్లను ఎక్కడం వల్ల కాళ్ల కండరాలు బలంగా అవుతాయి. అలాగే గుండె కొట్టుకునే వేగం మెరుగుపడుతుంది. దీనికోసం ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు మెట్లను ఎక్కండని నిపుణులు చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories