ఈ మల్టీ-బిలియన్ జంక్ ఫుడ్ ఇండస్ట్రీకి మన పిల్లల ఆరోగ్యం కంటే వారి వార్షిక లాభాలే ముఖ్యం. మనం పిల్లలకు ఇస్తున్నది శక్తినిచ్చే ఆహారమా లేక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే అలవాటా? అని ఒక్కసారి ఆలోచించాలి.
మార్పు మనతోనే మొదలవ్వాలి : ఇంట్లో చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు, సజ్జలు) వాడకం పెంచాలి.
అవగాహన : ప్రకటనల మాయలో పడకుండా, ప్యాకెట్ వెనుక ఉండే ‘న్యూట్రిషన్ లేబుల్’ చదవడం అలవాటు చేసుకోవాలి.
సహజ ఆహారం : ప్రాసెస్ చేసిన ఆహారం కంటే ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
నేడు మనం మార్చుకునే ఒక చిన్న అలవాటు.. రేపటి తరం ఆరోగ్యానికి ఒక పెద్ద వరం అవుతుంది.
By
suneetha. Principal. Slate the school. Bowrampet