ప్యాకేజ్డ్ వాటర్ స్వచ్ఛమైనదని, మినరల్స్‌తో నిండి ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ బాటిళ్లలో నింపే నీళ్లన్నీ ఆరోగ్యానికి మంచివి కావని మీకు తెలుసా? మరి బయట మార్కెట్ లో అమ్మే నీరు స్వచ్చమైనదో కాదో తెలుసుకోవడం ఎలా..?
Packaged Drinking Water Bottle : శరీరానికి పౌష్టికాహారం ఎంత అవసరమో స్వచ్ఛమైన, మినరల్స్ ఉన్న నీరు కూడా అంతే అవసరం. పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్నవారు రోజూ రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగమని వైద్య నిపుణులు సలహా ఇస్తారు. అయితే బయటకు వెళ్లినప్పుడు షాపుల్లో దొరికే వాటర్ బాటిల్స్ కొని తాగుతాం. బాటిల్ నీరు స్వచ్ఛమైనదని చాలామంది నమ్ముతారు. కానీ మార్కెట్లో దొరికే అన్ని వాటర్ బాటిల్స్ స్వచ్ఛమైనవి కావు. మరి మినరల్ వాటర్‌కి, మామూలు ట్యాప్ వాటర్‌కి తేడా ఎలా తెలుసుకోవాలి..?
25
అన్ని వాటర్ బాటిల్స్ లో మినరల్ వాటర్ ఉండదా..?
మార్కెట్లో రకరకాల కంపెనీల వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉన్నాయి. 1 లీటర్ నుంచి 5 లీటర్ల వరకు, అంతకంటే ఎక్కువ సైజుల్లో కూడా బాటిల్స్ దొరుకుతాయి. ఈ వాటర్ బాటిల్స్ ధర 10 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇలా బాటిల్‌లో దొరికే నీళ్లన్నీ స్వచ్ఛమైనవని మనం అనుకుంటాం. వాటిలో అవసరమైన మినరల్స్ ఉంటాయని భావిస్తాం. కానీ అన్ని బాటిళ్లలో స్వచ్ఛమైన నీరు ఉండదు. కొందరు కేవలం ట్యాప్ నీటిని నింపి అమ్మేస్తుంటారు.
35
వాటర్ బాటిల్లోని నీరు మంచిదేనా గుర్తించడం ఎలా..?
బాటిల్‌లోని నీటి నాణ్యతను మీరు సులభంగా గుర్తించవచ్చు. దీనికోసం వాటర్ బాటిల్‌పై ఉన్న లేబుల్‌ను చదవాలి. అక్కడే మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది. బాటిల్‌పై 'PWS' అనే పదం ఉందో లేదో చెక్ చేయాలి. కొన్నేళ్ల క్రితం అమెరికాకు చెందిన ఓ కంపెనీ తాము అమ్ముతున్నది మినరల్ వాటర్ కాదని, ట్యాప్ వాటర్ అని అంగీకరించింది. ఆ తర్వాత అన్ని కంపెనీలు తమ వాటర్ బాటిళ్లపై 'PWS' అని రాయడం తప్పనిసరి అయింది.
PWS అంటే 'పబ్లిక్ వాటర్ సోర్స్' (Public Water Source). అంటే ఈ నీటిని ట్యాప్‌ల వంటి పబ్లిక్ నీటి వనరుల నుంచి సేకరించారు. ఇది మినరల్ వాటర్ కాదు. ప్రతి వాటర్ బాటిల్‌పై నీటిని ఎక్కడి నుంచి సేకరించారనే సమాచారం ఉంటుంది. దాన్ని బట్టి మీరు కొన్నది ట్యాప్ వాటరా లేక మినరల్ వాటరా అని తేల్చుకోవచ్చు.
55
ట్యాప్ వాటర్ రోజూ తాగితే ఏమవుతుంది..?
నీటిలో ఉండే మినరల్స్ వల్లే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ట్యాప్ వాటర్‌లో కూడా కాపర్, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ట్యాప్ వాటర్ తాగిన వెంటనే ఆరోగ్యం పాడవ్వదు. కానీ రోజూ ఇదే నీటిని తాగితే నెమ్మదిగా ఆరోగ్యం దెబ్బతింటుంది. కడుపునొప్పి, డయేరియా, వాంతులు, హెపటైటిస్, కలరా లేదా టైఫాయిడ్ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ట్యాప్ వాటర్ తో కూడిన బాటిల్ నీరు ఎక్కువగా తాగకూడదు.