Cancer Test: ఒక్క ర‌క్త ప‌రీక్ష‌తో క్యాన్స‌ర్ గుర్తింపు.. స‌రికొత్త ప‌ద్ధ‌తి అభివృద్ధి

Published : Apr 22, 2026, 08:01 PM IST

Cancer Test: వైద్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు పెద్ద పరీక్షలు, స్కాన్లు అవసరమైన క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులను, భవిష్యత్తులో ఒక చిన్న రక్త పరీక్షతోనే ముందుగానే గుర్తించ‌నున్నారు. తాజాగా ఈ దిశగా కొత్త అడుగు పడింది.  

PREV
15
ఈ కొత్త టెస్ట్ పేరు ఏమిటి?

ఈ టెక్నాలజీకి “మెథిల్‌స్కాన్ (MethylScan)” అని పేరు పెట్టారు. ఇది మన రక్తంలో ఉన్న చిన్న చిన్న DNA భాగాలను పరిశీలించి, శరీరంలో ఏమైనా అసాధారణ మార్పులు ఉన్నాయా అని తెలుసుకుంటుంది. మన శరీరంలోని సెల్స్ నశించినప్పుడు, వాటి DNA భాగాలు రక్తంలోకి వస్తాయి. ఈ టెస్ట్ వాటిని విశ్లేషించి, వ్యాధుల సంకేతాలను గుర్తిస్తుంది.

25
ఇది ఎలా పనిచేస్తుంది?

మన శరీరంలోని ప్రతి సెల్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఆరోగ్యకరమైన సెల్స్‌తో పాటు అనారోగ్యమైన సెల్స్ మధ్య DNAలో కొన్ని మార్పులు ఉంటాయి. వీటిని “మిథైలేషన్ ప్యాటర్న్స్” అంటారు. మెథిల్‌స్కాన్ ఈ ప్యాటర్న్స్‌ను గుర్తించి శరీరంలో వ్యాధి ఉందా? ఉంటే ఏ స్థాయిలో ఉంది? అనే విషయాలను తెలుసుకుంటుంది.

35
పరిశోధనలో ఎదురైన సమస్యలు, పరిష్కారం

రక్తంలో ఎక్కువగా ఆరోగ్యకరమైన సెల్స్ DNA ఉండడం వల్ల అసలు వ్యాధి సంకేతాలను గుర్తించడం కష్టం. దీనిని “బ్యాక్‌గ్రౌండ్ నాయిస్” అంటారు. ఈ సమస్యను అధిగమించడానికి పరిశోధకులు ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించారు. అవసరం లేని DNAను తొలగించారు, ముఖ్యమైన సమాచారం ఉన్న DNAపై దృష్టి పెట్టారు. ఈ టెక్నిక్ వల్ల పరీక్ష ఖచ్చితత్వం పెరిగింది, ఖర్చు కూడా తగ్గింది. ఈ అధ్యయనంలో 1000 మందికి పైగా వ్యక్తులపై పరీక్షలు నిర్వహించారు.

45
టెస్ట్ ఫలితాలు ఎలా ఉన్నాయి?

ఈ టెస్ట్ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. మొత్తం క్యాన్సర్ కేసుల్లో సుమారు 63% గుర్తించింది. ప్రారంభ దశ క్యాన్సర్‌లలో అర్ధానికి పైగా గుర్తించింది. లివర్ క్యాన్సర్‌లో హై రిస్క్ గ్రూప్‌లో 80% వరకు గుర్తింపు సాధించింది. ఇంకా ముఖ్యంగా, ఈ టెస్ట్ శరీరంలో ఏ భాగంలో సమస్య ఉందో కూడా సూచిస్తుంది. ఇది డాక్టర్లకు తదుపరి చికిత్సలో చాలా సహాయం చేస్తుంది.

55
భవిష్యత్తులో ప్రయోజనం

ఇది ఇంకా ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ అయినప్పటికీ, భవిష్యత్తులో పెద్ద మార్పున‌కు దారితీయవచ్చు. ఒక చిన్న రక్త పరీక్షతోనే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ముందుగానే గుర్తిస్తే, చికిత్స సులభం అవ‌డంతో పాటు ప్రాణాలను కాపాడవచ్చు. అందుకే ఈ పరిశోధన వైద్య రంగంలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories