Liver Health: మీ లివర్ హెల్దీగా ఉండాలంటే.. ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తాగండి !

Published : Jun 27, 2025, 02:37 PM IST

Best Drinks to Liver Health: శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం కీలకంగా వ్యవహరిస్తుంది. అలాంటి లివర్ సరిగ్గా పనిచేయక పోతే శరీరంలో విష పదార్థాలు పేరుకు పోతాయి. ఈ లివర్ హెల్త్ సమస్యలకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం. 

PREV
15
లివర్ హెల్త్ కాపాడే సూపర్ డ్రింక్స్

మన శరీరంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది టాక్సిన్స్ ని తొలగించడానికి, పోషకాలను గ్రహించడానికి, ప్రోటీన్ ఉత్పత్తికి లివర్ సహాయపడుతుంది. అలాంటి లివర్ హెల్త్ కి సహాయపడే హెర్బల్ టీల గురించి ఇక్కడ తెలుసుకోండి.

25
పసుపు టీ

పసుపు ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైనది. దాని రంగుకి కారణం కుర్కుమిన్. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు లివర్ వాపుని తగ్గించడంలో సహాయపడతాయి. పసుపు టీ పైత్యరస ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగిస్తుంది.

35
అతిమధురం టీ

తీపిగా ఉండే అతిమధురం అద్భుతమైన ఆయుర్వేద మూలిక. దీనిలో గ్లైసిరిజిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, లివర్ ప్రొటెక్టివ్ లక్షణాలు ఉంటాయి. దీంతో టీ తయారు చేసుకుని తాగితే లివర్ వాపు తగ్గుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అయితే.. అతిమధురం మితంగా ఉపయోగించాలి. ఎక్కువగా ఉపయోగిస్తే దుష్ప్రభావాలు కలగవచ్చు.

45
అల్లం టీ

అల్లంలో కూడా ఎన్నో ఆయుర్వేద ఔషధ గుణాలుంటాయి. ఇందులో  శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా అల్లం టీ తాగడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా తగ్గుతుంది. రోజు ఒకసారి అల్పాహారానికి ముందు అల్లం టీ తాగితే.. మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

55
లెమన్ టీ

లెమన్ టీ కాలేయానికి చాలా మంచిది. కాలేయాన్నిశుద్ది చేయడంలో  సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. లెమన్ టీలో ఉండే సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి కాలేయానికి సహజమైన క్లెన్సర్‌లుగా పనిచేస్తాయి, శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్‌లను తొలగిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories