వేపాకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో వేపాకులు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వేపాకులు నోటిని శుభ్రం చేయడానికి, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రక్త శుద్ధి, చర్మ ఆరోగ్యానికి కూడా ఇవి చక్కగా పనిచేస్తాయి.
25
కడుపు సమస్యలకు చెక్..
ఆయుర్వేదం ప్రకారం వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 3-4 వేప ఆకులు నమిలి తింటే.. కడుపు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు వేప ఆకులు తింటే అవి ఇట్టే తగ్గిపోతాయి.
35
షుగర్ కంట్రోల్లో ఉంటుంది!
వైద్యుల ప్రకారం వేప ఆకుల రసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. వేప ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు, గ్లైకోసైడ్లు, టెర్పెనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు వంటివి ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
వేప ఆకులు చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. దానివల్ల శరీరంలోని అన్ని విష పదార్థాలు తొలగిపోతాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మొటిమలు ఉన్నవారు వేప ఆకులను వారి డైట్ లో చేర్చుకోవచ్చు. అంతేకాదు వేప ఆకులు తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడం సులభం అవుతుంది.
55
కాలేయ ఆరోగ్యానికి..
ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులు నమిలి తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. వేప కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకులు నమిలి తినడం వల్ల దంత క్షయం నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతుంది. దంతాలు బలపడతాయి.