Benefits of Soaked Black Grapes in Milk: నల్లద్రాక్ష రోజూ తీసుకోవడం వల్ల మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాంటి నల్లద్రాక్షను 30 రోజుల పాటు పాలలో నానబెట్టి తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయంట. ప్రయోజనాలెంటో ఇక్కడ తెలుసుకుందాం..
నల్ల ఎండు ద్రాక్ష (Black Grapes) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలం. దీన్ని రాత్రంతా పాలలో నానబెట్టి తింటే, శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. 30 రోజుల పాటు తీసుకోవడం శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది.
28
నల్లద్రాక్షను పాలలో నానబెట్టి తింటే అద్భుత ఫలితాలు.
నల్లద్రాక్షలో ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, ఫైబర్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే.. పాలలో ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ డి, విటమిన్ బి12, పొటాషియం ఉంటాయి. నల్లద్రాక్షను పాలలో నానబెట్టితే.. ద్రాక్షలోని ఐరన్ మరింత పెరుగుతుంది. అదేవిధంగా ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు పాల పోషక విలువను మరింత పెంచుతాయి.
38
తయారీ విధానం
సుమారు 8 నుండి 10 మంచి నాణ్యమైన నల్లద్రాక్షలను తీసుకోండి. ఈ ద్రాక్షలను నీటిలో కడిగి, దుమ్ము, ధూళిని తొలగించండి. తర్వాత ఒక చిన్న గాజు లేదా పింగాణీ గిన్నెలో కడిగిన ద్రాక్ష వేసి, అవి పూర్తిగా మునిగేంత వరకు పాలు పోయండి. కనీసం 8-12 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ద్రాక్షను తిని, ఆ తర్వాత పాలు తాగండి. ఇలా 30 రోజుల పాటు చేస్తే.. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి.
నల్లద్రాక్షలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి చాలా అవసరం. హిమోగ్లోబిన్ అంటే ఎర్ర రక్త కణాలలో ఆక్సిజన్‌ను తీసుకువెళ్లే ప్రోటీన్. ఇనుము లోపం రక్తహీనతకు దారితీస్తుంది, దీని లోపం వల్ల అలసట, బలహీనత, తలతిరుగుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగుతాయి. పాలతో కలిపి తీసుకున్నప్పుడు, పాలలోని కొన్ని ప్రోటీన్లు ఐరన్ శోషణ శక్తిని పెంచుతుంది.
58
మెరుగైన జీర్ణవ్యవస్థ
నల్లద్రాక్షలో ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్స్ పెద్దప్రేగులోని నీటిని గ్రహించి మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇది కాకుండా.. ప్రేగుల చలనాన్ని సులభతరం చేస్తుంది. ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది, ఇది మొత్తం ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
68
చర్మ ఆరోగ్యం
నల్లద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆక్సిడేటివ్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇది చర్మంలో కలిగే ముడతలు, నల్ల మచ్చలు, గీతలను తగ్గించి, వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాియి. పాలలోని లాక్టిక్ యాసిడ్, ప్రోటీన్లు చర్మానికి తేమను అందించి, మృదువుగా చేస్తాయి. ఇది చర్మాన్ని లోపలి నుండి మెరిసేలా చేస్తాయి.
78
నిద్రలేమికి చెక్
నల్లద్రాక్షలో మెగ్నీషియం, కొన్ని అమైనో ఆమ్లాలు ఉంటాయి, ఇవి నిద్రను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ రెండు పదార్థాల మిశ్రమం మంచి నిద్ర పొందడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది.
88
గుండె ఆరోగ్యం పదిలం
నల్లద్రాక్షలోని పొటాషియం, శరీరంలోని సోడియం స్థాయిలను నియంత్రించి, రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా పాలీఫెనాల్స్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రక్తనాళాలకు కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇది గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.