Acidity Problem: గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఒకే ఒక్క పండుతో చెక్ పెట్టొచ్చు

Published : Jun 18, 2025, 01:24 PM IST

Acidity Problem: గ్యాస్, ఎసిడిటీ లేదా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే.. రోజూ మీ ఆహారంలో ఈ ప్రత్యేక పండును చేర్చుకోండి. ఇది మీ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఇంతకీ ఆ స్పెషల్ ఫ్రూట్ ఏంటీ? 

PREV
16
ఒకే ఒక్క పండుతో ఆ సమస్యలకు చెక్

నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఎసిడిటీ సమస్య తర్వాతే ఉదరానికి సంబంధించిన అన్ని సమస్యలు మొదలవుతాయి. ఈ సమయంలో యాంటాసిడ్స్ లేదా ఇంటి చిట్కాలు వెతుకుతాం. కానీ మీరు ప్రతిరోజూ ఈ ఒక్క పండు తింటే చాలు.. అన్ని రకాల కడుపు సమస్యలు తగ్గుతాయి. అదే బొప్పాయి.

26
జీర్ణక్రియను మెరుగుపరచడంలో

బొప్పాయి తినడం అనేది ఎంతో ప్రయోజనకరం. ఇందులో ఉన్న పోషకాలు శరీరాన్ని శక్తివంతం చేయడంలో జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇంకా ఇతర అనేక సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే 'పపైన్' అనే ఎంజైమ్ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసుకోవడానికి, కడుపును తేలికగా ఉంచడానికి సహాయపడుతుంది.

36
ఎసిడిటీ కంట్రోల్

బయట ఆహరం లేదా వేపుళ్ళు ఎక్కువగా తిన్నప్పుడు కడుపులో గ్యాస్, ఎసిడిటీ  సమస్యలు వేధిస్తాయి. బొప్పాయి మ్యాజిక్ లా పనిచేస్తుంది. బొప్పాయి వలన అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. దీనిలో ఉన్న ఫైబర్ కూడా జీర్ణవ్యవస్థను సమర్ధవంతంగా పనిచేయించడంలో బాగా సహాయపడుతుంది. 

46
మలబద్దకానికి చెక్

ఒత్తిడితో కూడిన జీవనశైలి, చెడిపోతున్న ఆహారపు అలవాట్ల వల్ల మలబద్ధకం సర్వసాధారణం. బొప్పాయి సూపర్‌ఫ్రూట్‌గా పనిచేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది.

56
ఆకలిని పెంచడానికి

ఆకలి సరిగ్గా లేకపోవడం లేదా ఆకలి ఉన్నా తినలేకపోవడం చాలా మందికి ఉండే సమస్య. ఈ సమస్యకూ బొప్పాయి పరిష్కారం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియ బాగుంటే.. శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించగలుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది.

66
రోగనిరోధక శక్తిని పెంచడంలో

బొప్పాయిలో ఉండే విటమిన్ C, A, E వంటి పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు..  ఇన్ఫెక్షన్లను నియంత్రణ, రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా మీరు సాధారణ జలుబు లేదా ఇతర వైరస్ వ్యాధుల నుండి కూడా రక్షించబడతారు

గమనిక: ఈ కథనంలోని సూచనలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి. 

Read more Photos on
click me!

Recommended Stories