Ghee: రోజూ వేడినీటిలో నెయ్యి కలిపి తాగితే.. ఊహించని లాభాలు.. వెంటనే అలవాటు చేసుకోండి

Published : Jun 26, 2025, 12:15 PM IST

Ghee Water Benefits: సాధారణంగా కొంతమంది ఉదయం నిద్రలేచిన వెంటనే వేడినీరు తాగుతారు. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. అయితే వేడినీటిలో నెయ్యి కలుపుకుని తాగడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుందట. ఆ ప్రయోజనాలెంటో తెలుసుకుందాం. 

PREV
17
వేడినీటిలో నెయ్యి కలిపి తాగితే

నెయ్యిలో ఎన్నో  ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. మన ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి ప్రోటీన్స్, కొవ్వుని కరిగించే విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.అలాంటి నెయ్యి ని నీళ్లలో కలుపుకుని రాత్రిపూట తాగితే..  జీర్ణశక్తి మెరుగు పడటమే కాకుండా కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. మరిన్ని లాభాలు ఇక్కడ తెలుసుకుందాం.. 

27
జీర్ణవ్యవస్థ బలోపేతం

రాత్రిపూట నెయ్యి, గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల కడుపు సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి జీర్ణక్రియకు సహాయపడేలా ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. 

37
నిద్రలేమికి చెక్

నిద్ర సమస్య ఉన్నవారికి నెయ్యి చక్కని పరిష్కారం. నెయ్యిలోని కొవ్వు ఆమ్లాలు మెదడుకు విశ్రాంతినిస్తాయి.

47
కీళ్ల నొప్పులకు ఉపశమనం

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు ఉన్నవారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది.

57
మెరుగైన చర్మం కోసం

నెయ్యి శరీరాన్ని లోపలి నుండి తేమగా ఉంచడానికి, చర్మానికి మృదుత్వాన్ని అందిస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది, చర్మానికి తేమను అందించి,  చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

67
బరువు తగ్గడానికి

బరువు తగ్గాలనుకునే వారు నెయ్యిని మన డైట్ ల్ చేర్చుకోవచ్చు. నెయ్యిలో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ నెయ్యి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలా బరువు కూడా తగ్గుతుంది. 

77
జ్ఞాపకశక్తి పెరుగుదలకు

నెయ్యి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెయ్యిలో ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories