దానిమ్మ.. ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలుసు. అయితే దానిమ్మ పండే కాదు.. దాని తొక్క కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన దానిమ్మ తొక్కను ఎలా వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇక్కడ చూద్దాం.
నిపుణుల ప్రకారం.. దానిమ్మ తొక్క చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినడాన్ని నివారిస్తాయి. విటమిన్ సి కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది. మచ్చలు, గాయాలను నయం చేస్తుంది. ఈ తొక్కలను ఫేస్ ప్యాక్ గా వాడితే మొటిమలు, నల్ల మచ్చలు ఈజీగా తగ్గుతాయి. ఇది సహజ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.
25
కొల్లాజెన్ ఉత్పత్తికి..
దానిమ్మ తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు ముందస్తుగా వచ్చే ముడతలను నివారించి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. దానిమ్మ తొక్కలో పాలీఫెనాల్స్ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
దానిమ్మ తొక్కలను టీ లేదా కషాయంగా తయారు చేసుకొని తాగడం ద్వారా గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు బాక్టీరియా, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
35
లివర్ ఆరోగ్యానికి..
దానిమ్మ తొక్కలో లివర్ ని శుభ్రపరిచే గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఇందులోని ఖనిజాలు, ఇతర సమ్మేళనాలు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ తొక్కతో చేసిన టీ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అంతేకాదు ఈ తొక్కలో ప్యూనికలగిన్ అనే పాలీఫెనాల్ ఉంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు, నోరు, రొమ్ము క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
దానిమ్మ తొక్కలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. దానిమ్మ తొక్కను ఎండలో బాగా ఆరబెట్టి, పొడి చేసి, ఉప్పు, మిరియాలు కలిపి పళ్లు తోముకుంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది.
దానిమ్మ తొక్కను బాగా శుభ్రం చేసి, ఆరబెట్టి పొడి చేసి టీ, కషాయం, ఫేస్ ప్యాక్ వంటి వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు.
55
ఇవి గుర్తుంచుకోండి!
దానిమ్మ తొక్కను ఆరబెట్టి పొడి చేసి, గాజు సీసాలో నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఉపయోగించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.