Alcohol: రాత్రి ఆల్కహాల్ తాగితే ఉదయం ఎందుకు హ్యాంగోవర్ ఉంటుంది.? అస‌లు కార‌ణం ఇదే

Published : Feb 21, 2026, 01:30 PM IST

Alcohol: ఆల్క‌హాల్ తాగుతున్న స‌మ‌యంలో బాగానే ఉంటుంది. కానీ మరుసటి రోజు ఉదయం లేచే సరికి తలనొప్పి, నోరు ఎండిపోవడం, వాంతుల భావన, అలసట వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలా ఎందుకు జ‌రుగుతుందంటే.? 

PREV
15
ప్రధాన కారణం, డీహైడ్రేషన్

ఆల్కహాల్ శరీరంలో డైయూరెటిక్‌లా పనిచేస్తుంది. అంటే కిడ్నీలు సాధారణం కంటే ఎక్కువగా మూత్రాన్ని విడుదల చేయేలా చేస్తుంది. దీంతో శరీరంలో నీరు, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు తగ్గిపోతాయి. దీని వల్ల తీవ్ర తలనొప్పి, నోరు ఎండిపోవడం, తల తిరగడం, ఎక్కువ దాహం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. శరీరంలో ద్రవాల కొరత పెరిగితే మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. ఇదే తలనొప్పికి ముఖ్య కారణం.

25
ఏసిటాల్డిహైడ్ విష ప్రభావం

మద్యం శరీరంలోకి వెళ్లిన తర్వాత కాలేయం (లివర్) దాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ప్రక్రియలో ముందుగా ఏర్పడే పదార్థం ఏసిటాల్డిహైడ్. ఇది ఆల్కహాల్ కంటే కూడా ఎక్కువ హానికరమైనది. ఈ పదార్థం శరీరంలో ఎక్కువగా పేరుకుపోతే వాంతుల భావన, చెమటలు, ముఖం ఎర్రబడటం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి హ్యాంగోవర్ తీవ్రతను పెంచుతాయి.

35
రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం

ఆల్కహాల్ లివర్ గ్లూకోజ్ తయారీని అడ్డుకుంటుంది. గ్లూకోజ్ శరీరానికి శక్తి ఇవ్వడానికి అవసరం. రక్తంలో చక్కెర స్థాయి తగ్గితే అలసట, బలహీనత, చిరాకు, వణుకు లాంటివి వస్తాయి. అందుకే మద్యం తాగిన మరుసటి రోజు శరీరం బలహీనంగా అనిపిస్తుంది.

45
కడుపులో మంట, అసౌకర్యం

మద్యం కడుపు పొరను చిరాకుకు గురి చేస్తుంది. గ్యాస్ట్రిక్ ఆమ్లం ఉత్పత్తి పెరుగుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో మద్యం తాగితే ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి.

55
ఉదయం ఎందుకు ఎక్కువ ఇబ్బంది?

రక్తంలో ఆల్కహాల్ స్థాయి సున్నాకి చేరినప్పుడు హ్యాంగోవర్ లక్షణాలు గరిష్టంగా ఉంటాయి. ఆ సమయానికి శరీరం డీహైడ్రేషన్, విషపదార్థాల ప్రభావం, తక్కువ చక్కెర స్థాయి, కడుపు సమస్యలు, నిద్రలేమి వంటి అంశాలతో పోరాడుతోంది. అందుకే మద్యం తాగిన తర్వాతి రోజు ఉదయం ఎక్కువగా అస్వస్థత అనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories