ఆ సమయంలో ఇవి ఉండకపోతే.. బెడ్‌పై మీరు రెచ్చిపోతారంతే.!

Published : Feb 19, 2026, 10:05 PM IST

Physical Relationship: ప్రతీ ఒక్కరి జీవితంలో శారీరిక సంబంధం ఒక భాగం. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోవడం, అపోహలు, భయాలు, నెగెటివ్ ఆలోచనలు కారణంగా చాలామంది దంపతులు పూర్తిగా దాన్ని..

PREV
15
ఫిజికల్ రిలేషన్ షిప్ ఒక భాగం

ప్రతీ ఒక్కరి జీవితంలో ఫిజికల్ రిలేషన్ షిప్ ఒక భాగం. అయితే దీనిపై సరైన అవగాహన లేకపోవడం, అపోహలు, భయాలు, నెగెటివ్ ఆలోచనలు కారణంగా చాలామంది దంపతులు పూర్తిగా దాన్ని ఆస్వాదించుకోలేకపోతున్నారని ప్రముఖ వైద్యుడు, సామజిక సంస్కర్త డాక్టర్ సమరం పేర్కొన్నారు. మరి ఆయన చెప్పిన పలు కీలక విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

25
హైపర్ సెక్సువాలిటీ & హైపో సెక్సువాలిటీ

డాక్టర్ సమరం మొదటగా “హైపర్ సెక్సువాలిటీ”(ఆ కోరికలు) “హైపో సెక్సువాలిటీ” (దానిపై తక్కువ ఆసక్తి) గురించి వివరించారు. ఈ రెండూ పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ కనిపించవచ్చని చెప్పారు. శారీరక, మానసిక, హార్మోన్ల మార్పులు, ఒత్తిడి లాంటి కారణాలు వీటికి కారణమవుతాయన్నారు. అయితే ఇవి సిగ్గుపడాల్సిన విషయాలు కావు. సరైన అవగాహన, పరస్పరంగా ఒకరికొకరు చెప్పుకోవడం, అవసరమైతే వైద్య సలహా ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చని ఆయన సూచించారు.

35
ఆ కోరిక అనేది సహజం

ఇంటిమేసి అనేది సహజంగా మనిషికి వచ్చే ఓ కోరిక. దీనిని భయం, అపోహలతో కాకుండా ప్రశాంతమైన మనసుతో, సానుకూల దృక్పథంతో స్వీకరించాలి. మనసులో భయం, సిగ్గు, నైతిక సంకోచాలు ఎక్కువగా ఉంటే ఆ అనుభవం పూర్తిగా ఆస్వాదించలేమని ఆయన చెప్పారు. మనసు ఎంత స్వేచ్ఛగా ఉంటే, ఆనందం అంత ఎక్కువగా ఉంటుందన్నారు.

45
“డూ”– “డోంట్” అవసరమా?

ఫిజికల్ రిలేషన్ షిప్ లో “ఇది చేయాలి”, “ఇది చేయకూడదు” అనే కఠిన నియమాలు పెట్టుకోవడం అవసరం లేదని చెప్పారు. ప్రధాన లక్ష్యం పరస్పర ఆనందం, ఉల్లాసం, సంతృప్తి అని ఆయన అన్నారు. కొంతమంది కొన్ని శరీర భాగాలను ముట్టుకోవద్దు. కొన్ని భంగిమలు అనుసరించవద్దు అనే అభిప్రాయాలు కలిగి ఉంటారు. ముఖ్యంగా కొందరు మహిళలు తమ ప్రైవేటు పార్ట్స్‌ను టచ్ చేయకూడదు అనే సంకోచాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి మానసిక అడ్డంకులు తమ ఆనందాన్ని తగ్గిస్తాయని ఆయన వివరించారు.

ఫిజికల్ రిలేషన్ షిప్ అనేది పరస్పర అనుమతుల మీద ఆధారపడాలి. భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఓపెన్‌గా మాట్లాడుకోవాలి. “ఇది చేయొద్దు”, “అది చేయకూడదు” అనే అడ్డులు తొలగించుకుని, ఇద్దరికీ సౌకర్యంగా ఉండే విధంగా అనుభవాన్ని పంచుకోవాలి. భార్యాభర్తల మధ్య ఉన్న భావోద్వేగ అనుబంధం బలంగా ఉంటే శారీరక అనుబంధం కూడా సంతోషకరంగా ఉంటుంది.

55
అపోహలను పక్కకి పెట్టండి..

ఆ విషయంలో మనసులో ఉన్న అడ్డంకులను తొలగించాలి. భయం, సిగ్గు, అపోహలు, అనవసర నియమాలు ఇవన్నీ ఆనందానికి అడ్డుపడతాయి. జ్ఞానం పెరిగితే అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగితే అనుభవం మెరుగవుతుంది.

“Knowledge is Power” అని డాక్టర్ సమరం అన్నారు. దాని గురించి సరైన సమాచారం సమాజానికి చేరాలి. ఈ విషయాలు దాచిపెట్టాల్సినవి కాదు. సరిగ్గా అందరికీ తెలిస్తే సమాజంలో ఆరోగ్యకరమైన మార్పులు వస్తాయి. మొత్తంగా ఫిజికల్ రిలేషన్ షిప్ అనేది జీవితంలో ఓ భాగం. దీనిని భయం, అపోహలు, నియమాల లాంటి గోడల మధ్య బంధించకుండా, సానుకూల దృక్పథంతో, పరస్పర గౌరవంతో, ప్రశాంతమైన మనసుతో ఆస్వాదించాలి. అడ్డంకులు తొలగితే ఆనందం పెరుగుతుందని డాక్టర్ జి. సమరం స్పష్టం చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories