ఫస్ట్ నైట్ రోజున ఇవి దూరం పెడితే.. ఆ సుఖంలో పీక్స్‌కు వెళ్తారట..

Published : Feb 20, 2026, 10:10 PM IST

Wedding Night: ముఖ్యంగా సినిమాల్లో చూపించే విధంగా లేదా బయట వినే మాటల వల్ల అనవసరమైన ఆందోళనకు గురవుతుంటారు. ఈ అంశంపై డాక్టర్ సమరం కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టం చేశారు. అపోహలు ఏంటి.? వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాలపై..

PREV
15
భార్యభర్తలు ఎలా ఉండాలి

ఫస్ట్ నైట్ రోజున భార్యభర్తలు ఎలా ఉండాలి. ఆ సమయంలో వారిలో ఉండే అపోహలు ఏంటి.? వాటిని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాలపై డాక్టర్ సమరం ఏమన్నారో ఇప్పుడు చూసేద్దాం. చాలామంది నూతన వధూవరులకు తొలి రాత్రి గురించి అనేక భయాలు, సందేహాలు ఉంటాయి.

25
సినిమాల్లో చూపించే విధంగా

ముఖ్యంగా సినిమాల్లో చూపించే విధంగా లేదా బయట వినే మాటల వల్ల అనవసరమైన ఆందోళనకు గురవుతుంటారు. ఈ అంశంపై డాక్టర్ సమరం కొన్ని ముఖ్యమైన విషయాలను స్పష్టం చేశారు. ఫస్ట్ నైట్ రోజున రక్తస్రావం కాకపోతే ఆ అమ్మాయికి ఇదివరకే సంబంధాలు ఉన్నాయని భావించడం తప్పు అని చెబుతున్నారు.

35
ఇద్దరి మధ్య అవగాహన

శారీరక శ్రమ, ఆటలు లేదా సైక్లింగ్ లాంటి కారణాల వల్ల కూడా ఇలా జరుగుతుందని చెప్పారు. మొదటి రాత్రి కేవలం శారీరక కలయిక కోసం మాత్రమే కాదు, ఇద్దరి మధ్య అవగాహన పెంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. భయం లేదా ఒత్తిడితో కాకుండా, పరస్పర ఇష్టంతో గడపాలి.

45
సరైన అవగాహన, భాగస్వామి సహకారం..

చాలా మంది మహిళలు మొదటి కలయికలో విపరీతమైన నొప్పి ఉంటుందని భయపడతారు. కానీ సరైన అవగాహన, భాగస్వామి సహకారం ఉంటే అది అంత బాధాకరంగా ఉండదు. ఫస్ట్ నైట్ అనగానే ఏదో జరిగిపోతుందనే ఆందోళన మానుకోవాలి. అది ప్రకృతి సహజమైన ప్రక్రియ అని గుర్తించాలి.

55
ప్రేమానురాగాలే పునాది

దంపతుల మధ్య ఉండే ప్రేమానురాగాలే శారీరిక కలయికకు పునాది. తొలి రాత్రి గురించి అనవసరమైన భయాలను వదిలి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడే ఆ అనుభూతిని పరిపూర్ణంగా ఆస్వాదించగలరని డాక్టర్ సమరం వివరించారు.

Read more Photos on
click me!

Recommended Stories