Monsoon Health Tips: రోగ నిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్.. రోగాలు పరార్

Published : Jun 18, 2025, 11:48 AM IST

Monsoon Health Tips: వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువ. ఈ సీజన్‌లో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం చాలా కీలకం. వ్యాధుల బారిన పడకుండా, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఈ మసాలా దినుసులను రోజూ మీ ఆహారంలో చేర్చుకుంటే చాలు. అవి మీకు తెలుసా?

PREV
18
అల్లం

అల్లం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వికారం, జీర్ణ సమస్యలు, జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలపై ప్రభావితం చేస్తుంది. అల్లం టీ, అల్లం చట్నీ లేదా కూరగాయలు, మాంసంలో కలుపుకోవచ్చు. అల్లం కషాయం గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.

28
పసుపు

పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపును పాలతో కలిపి తాగవచ్చు లేదా అన్ని వంటకాల్లోనూ వాడవచ్చు. ఫేస్ ప్యాక్, గాయాలపై నేరుగా కూడా వాడవచ్చు.

38
వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని రోగాల నుంచి కాపాడతాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చే వారికి ఇది ఒక రక్షణ వచంలా పని చేస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే ఆరోగ్యానికి మేలు. కూరలు, సూప్‌లు, చట్నీలలో కలుపుకుని తినవచ్చు.

48
మిరియాలు

మిరియాలను ‘బ్లాక్‌గోల్డ్‌’అని కూడా పిలుస్తారు. వీటిలో మెగ్నీషియం, ఐరన్‌, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్‌ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. మిరియాలను మన రోజూవారీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, జలుబు, దగ్గుకు ఉపశమనం కలిగిస్తుంది. గుండె జబ్బు, క్యాన్సర్‌, అల్జీమర్స్‌, డయాబెటిస్‌, వంటి రుగ్మతల నుంచి రక్షిస్తుంది.

58
జీలకర్ర

జీలకర్ర జీర్ణక్రియకు చాలా మంచిది. ఇది గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ–ఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల శరీరంలో చేరిన మలినాలను, ఫ్రీ–రాడికల్స్‌’ను తొలగించి, వ్యాధులను తట్టుకొనే విధంగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

68
కొత్తిమీర

కొత్తిమీర జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. కొత్తిమీర శరీర వేడిని తగ్గిస్తుంది. 

78
యాలకులు

యాలకులలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అలాగే..  శ్వాసకోశ సమస్యలను పరిష్కారిస్తాయి.  టీ, స్వీట్లు, కొన్ని వంటకాల్లో సువాసన కోసం యాలకులను వాడవచ్చు.

88
లవంగాలు

లవంగాల్లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.  ఇవి బాడీపెయిన్స్‌ని తగ్గించి అలసటని దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జలుబు, దగ్గు లక్షణాలను కూడా తగ్గిస్తాయి. వీటిని టీలో కలుపుకోవచ్చు లేదా నేరుగా నమిలి తినవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories