వయసుకు తగ్గ ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు వంటివి ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకాన్ని నివారిస్తాయి. పాల ఉత్పత్తులు, ఆకుకూరలు ఎముకలకు మంచివి. పప్పులు, చేపలు, చికెన్, గుడ్లు వంటివి కండరాలకు మంచివి.