Constipation: మలబద్ధకంతో బాధపడుతున్నారా? వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి..

Published : Jul 10, 2025, 12:34 PM IST

Constipation: మలబద్ధకం సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారా? దీనివల్ల రోజంతా అసౌకర్యంగా ఉంటున్నారా ? ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోతున్నారా? అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే..  ఈ 5 కూరగాయలను మీ డైట్ చేర్చుకోండి.  తక్షణ ఉపశమనం పొందండి. 

PREV
18
మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారా?

మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా? ఈ సమస్య వల్ల రోజంతా అసౌకర్యంగా అనిపించడం, ఏ పని మీదా దృష్టి పెట్టలేకపోవడం లాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. ఇది చిన్న సమస్యలా అనిపించవచ్చు కానీ శరీరంపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది. కనుక ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే పరిష్కారం కోసం ప్రయత్నించాలి. 

28
మలబద్ధక సంకేతాలు

మన ఆరోగ్యానికి పేగుల ఆరోగ్యం బేస్‌మెంట్ లాంటిది. పేగుల్లో వాపు, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు శరీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మూడు రోజులు మలవిసర్జన లేకపోతే దాన్ని మలబద్ధకంగా పరిగణిస్తారు. దీర్ఘకాలంగా మలబద్ధకం ఉంటే కడుపు నొప్పి, మంట, వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. కనుక ఈ సమస్యను చిన్నగా తీసుకోకుండా, తక్షణ పరిష్కారం తీసుకోవడం అవసరం.

38
మలబద్ధకాన్ని చెక్ పెట్టండిలా..

మలబద్ధకాన్ని నివారించాలంటే ఫైబర్ ( పీచు పదార్థం) పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.  పండ్లు, కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన కూరగాయల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పేగుల కదలికకు అవసరమైన ఇతర పోషకాలను కూడా అందిస్తాయి. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు ఈ కూరగాయలను రోజూ తమ ఆహారంలో చేర్చుకుంటే తక్షణ ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం సమస్యను పరిష్కరించడంలో సహాయపడే కొన్ని కూరగాయల గురించి ఈ పోస్ట్‌లో తెలుసుకుందాం.

48
1. పాలకూర :

ఆకు కూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందులోనూ కరిగే ఫైబర మలబద్ధకాన్ని తగ్గించి, మలవిసర్జన సులభతరం చేస్తుంది. పాలకూరలో ఉండే మెగ్నీషియం జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించడానికి సహాయపడుతుంది. దీనివల్ల మలం సులభంగా బయటకు వస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఈ ఆకుకూరలను తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

58
2. బ్రోకలీ :

బ్రోకలీ ఫైబర్‌తో పాటు శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కరగని ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలవిసర్జన సులభతరం అవుతుంది. బ్రోకలీలో ఉండే సమ్మేళనాలు పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కాబట్టి బ్రోకలీని మీ ఆహారంలో తరచుగా చేర్చుకుంటే మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది, పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. 

68
3. క్యాబేజీ :

క్యాబేజీలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి మలబద్ధకం సమస్య ఉన్నవారు క్యాబేజీని మీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోండి. ఈ సమస్య నుంచి దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు.

78
4. క్యారెట్:

క్యారెట్ కేవలం కళ్లకే కాకుండా జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న ఫైబర్‌లు జీర్ణవ్యవస్థను శక్తివంతం చేస్తాయి. ముఖ్యంగా కరగని ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, మలవిసర్జనను సులభతరం చేస్తుంది. కాబట్టి మలబద్ధకంతో బాధపడేవారు క్యారెట్‌ను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల సహజ ఉపశమనం పొందవచ్చు.

88
5. చిలగడదుంప :

చిలగడదుంప తినడానికి రుచికరంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉన్న కరిగే,  కరగని ఫైబర్‌లు పేగుల కదలికను మెరుగుపరచి, మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులో విటమిన్ C, విటమిన్ A, నీటి శాతం కూడా అధికంగా ఉండటంతో జీర్ణక్రియ మెరుగవుతుంది. కాబట్టి చిలగడదుంపను తరచూ ఆహారంలో చేర్చడం వల్ల మలబద్ధకం సమస్యను నివారించవచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories