Cinnamon Tea Benefits: దాల్చిన చెక్క కేవలం ఒక మసాలా దినుసు మాత్రమే కాదు. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాంటి దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈ పోస్ట్‌లో వివరంగా చూద్దాం.
భారతీయ వంటల్లో తరచుగా ఉపయోగించే దాల్చిన చెక్క, ఆహార రుచిని పెంపొందించడమే కాకుండా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంది. శతాబ్దాలుగా ఇది ఆయుర్వేదంలోనూ, సాంప్రదాయ చికిత్సా పద్ధతుల్లోనూ వాడుతున్నారు. ఇలాంటి ఔషధ గుణాలున్న దాల్చిన చెక్కతో తయారైన టీ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
26
షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు
షుగర్ వ్యాధిగ్రస్తులకు దాల్చిన చెక్క టీ ఓ వరం అని చెప్పాలి. ఇది షుగర్ ను సహజంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రధానంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్క టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను గ్రహించి దాని స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది.
36
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్
యాంటీఆక్సిడెంట్లు, యాంటీబాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలతో నిండిన దాల్చిన చెక్క టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతూ, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లకు రక్షణ కల్పిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, అజీర్తి, గ్యాస్, ఉబ్బరం తగ్గించి, జీవక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికీ సహాయపడుతుంది.
దాల్చిన చెక్క టీ తాగడం వలన చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (HDL) పెరుగుతుంది. దీంతో రక్తనాళాలు బలపడి, గుండెకు రక్షణ కలుగుతుంది. ఇది రక్తనాళాలను బలపరస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచి గుండెజబ్బుల, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, మహిళల్లో నెలసరి సమయంలో కలిగే కడుపు నొప్పి, కండరాల వేదన, వికారం, వాంతులు వంటి సమస్యలను తగ్గించడంలో దాల్చిన చెక్క టీ ఎంతగానో సహాయపడుతుంది.
56
దాల్చిన చెక్క టీ తయారీ విధానం
దాల్చిన చెక్కలో ఉండే అలెర్జీ నిరోధక లక్షణాలు, గర్భాశయ చుట్టూ ఉన్న కండరాలను సడలించడంలో సహాయపడతాయి. దీంతో నెలసరి నొప్పులు, వికారం, కండరాల వేదన తగ్గుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.
తయారీ విధానం: ఒక పాత్రలో ఒక కప్పు నీరు తీసుకోండి. అందులో ఒక దాల్చిన చెక్క కర్ర లేదా అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5–10 నిమిషాలు మరిగించండి. చల్లారిన తర్వాత వడకట్టి, ఒక టీస్పూన్ తేనె లేదా కొద్దిగా నిమ్మరసం కలిపి తాగండి.
షుగర్ ఉన్నవారు తేనె, బెల్లం, పంచదార కలపకుండా నిమ్మరసం మాత్రమే కలిపి తాగాలి. ఇది నెలసరి రోజుల్లో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
66
వైద్య సలహా
దాల్చిన చెక్క టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయినా దీనిని మితంగా ఉపయోగించాలి. ఎందుకంటే ఇందులో ఉండే కూమరిన్ అనే రసాయనం అధికంగా తీసుకుంటే కాలేయానికి హానికరంగా మారవచ్చు, అందుకే గర్భిణీలు, బాలింతలు, దీర్ఘకాలిక వ్యాధులతో మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి.