Shefali jariwala: అతి తిండే అన‌ర్థాల‌కు కార‌ణం.. 200 ఏళ్లు ఎలా జీవించాలో చెప్పిన బాబా రాందేవ్

Published : Jul 02, 2025, 10:03 AM IST

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి పెఫాలీ జ‌రీవాలా మ‌ర‌ణం అంద‌రినీ షాక్‌కి గురి చేసిన విష‌యం తెలిసిందే. 42 ఏళ్ల వ‌య‌సులోనూ ఎంతో ఫిట్‌గా గ్లామ‌ర్‌గా క‌నిపించే పెఫాలీ ఉన్న‌ట్లుండి గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో ఇప్పుడీ అంశం దేశవ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. 

PREV
15
ఆ ముందులే కార‌ణ‌మా.?

కాంటాలాగా సాంగ్‌తో దేశ‌వ్యాప్తంగా పేరు సంపాదించుకున్న పెఫాలీ జ‌రీవాలా మృతి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ఆమె గుండెపోటుతో చనిపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిత్యం యోగా, వ్యాయామం చేసే ఆమె మ‌ర‌ణానికి యాంటీ ఏజింగ్ మందులే కార‌ణ‌మనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఆరేళ్లుగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె.. ప్రతి రోజు ఇందుకు సంబంధించిన మెడిసిన్ తీసుకుంటుందని.. ఈ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్‌తోనే గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో జరీవాలా మ‌ర‌ణంపై ప్ర‌ముఖ యోగా గురువు బాబా రాందేవ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

25
హార్డ్‌వేర్ బాగానే ఉంది సాఫ్ట్‌వేర్‌లోనే స‌మ‌స్య‌

అకాల మ‌ర‌ణాల‌పై స్పందించిన బాబా రాందేవ్.. మనం బ‌య‌ట నుంచి చూడ్డానికి బ‌లంగా క‌నిపిస్తున్నా అంతర్గతంగా దుర్బలంగా ఉంటే ప్రమాదమే అన్నారు. సిద్ధార్థ్ శుక్లను ఉదాహరణగా చూపిస్తూ – బాహ్య లక్షణాలు బాగున్నా, సిస్టమ్ ఫాల్టీగా ఉండటం వల్లే మృత్యువు సంభవించింది" అని అభిప్రాయపడ్డారు.

35
“మన జెనెటిక్ కోడ్‌ను నమ్మాలి”

“ప్రతి కణం జీవించడానికి సహజ సమయం ఉంటుంది. ఆ సమయాన్ని బయట నుంచి మారుస్తే, అది అంతర్గత విధ్వంసాలకు దారి తీస్తుంది” అని రాందేవ్ హెచ్చరించారు. మన అసలైన డీఎన్ఏకు దగ్గరగా జీవించాలన్నారు. అలా కాకుండా దానికి విరుద్ధంగా మ‌న జీవ‌న విధానం కానీ, తీసుకునే ఆహారం ఉంటే ఇబ్బందులు త‌ప్ప‌వ‌న్నారు.

45
నా హెల్త్ సీక్రెట్ అదే

త‌న హెల్త్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. "నేను ఇప్పుడు 60 ఏళ్లకైనా పైగా ఉన్నా – యోగ, మంచి ఆహారం, ప్రవర్తన వల్లే ఇంకా ఉత్సాహంగా జీవిస్తున్నాను" అని రాందేవ్ చెప్పారు. సరైన జీవనశైలి పాటిస్తే వందేళ్ల వరకు వృద్ధాప్యమన్న భావన రాదని స్పష్టం చేశారు. వందేళ్లు మాత్ర‌మే కాదు 150 నుంచి 200 ఏళ్లు కూడా జీవించ‌వ‌చ్చాన్నారు.

55
తీసుకునే ఆహార‌మే కార‌ణం

అన్ని ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు తీసుకునే ఆహార‌మే కార‌ణ‌మ‌ని అన్నారు బాబా రాందేవ్‌. ప్ర‌స్తుత జీవ‌న విధానంలో మనం మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నామ‌న్నారు. 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 సంవత్సరాల్లోనే తింటున్నాం అని చెప్పుకొచ్చారు. అందుకే ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి ముఖ్య‌మ‌నే విష‌యాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తించాల‌ని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories