మన ఆరోగ్యంలో కిడ్నీలు కీలకపాత్ర పోషిస్తాయి. అవి రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను శరీరం నుంచి బయటకు పంపిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేస్తేనే మన ఆరోగ్యం బాగుంటుంది. కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల పండ్లు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
పండ్లు ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలుసు. కొన్ని రకాల పండ్లు కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వాటిలోని పోషక గుణాలు కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. మరి ఏ పండ్లను రెగ్యులర్ గా తింటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయో ఇక్కడ చూద్దాం.
27
బ్లూబెర్రీ
బ్లూబెర్రీలో పొటాషియం తక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కిడ్నీలలో వాపును తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా బ్లూబెర్రీ తినడం వల్ల కిడ్నీ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
37
క్రాన్బెర్రీ
క్రాన్బెర్రీలు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మూత్రాశయ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా క్రాన్బెర్రీలు తీసుకోవడం వల్ల కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు కూడా క్రాన్బెర్రీలు సహాయపడుతాయి.
ఆపిల్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఆపిల్ లోని విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. వాపును తగ్గించి, కిడ్నీలను శుభ్రపరుస్తాయి.
57
ద్రాక్ష
ద్రాక్షలో ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు బీపీ, షుగర్ ను నియంత్రించడం ద్వారా కిడ్నీలను కాపాడుతాయి.
అనాస
అనాసలో ఉండే బ్రోమేలైన్ అనే ఎంజైమ్ శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. దీని పొటాషియం స్థాయి తక్కువగా ఉండడం వల్ల కిడ్నీ సమస్యలున్నవారికి ఇది చాలా మంచిది. యూరిక్ ఆమ్ల స్థాయిని నియంత్రించడంలోనూ అనాస సహాయపడుతుంది.
67
దానిమ్మ
దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీల వాపు, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తాయి. దానిమ్మ రసం దీర్ఘకాలిక వ్యాధుల వల్ల కలిగే నష్టం నుంచి కిడ్నీలను రక్షించడంలో సహాయపడుతుంది.
77
పుచ్చకాయ
కిడ్నీలను రక్షించడంలో పుచ్చకాయ చక్కగా సహాయపడుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ, సి, మెగ్నీషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటాయి. నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి కిడ్నీల పనిని తేలికచేస్తుంది.