షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఆహార నియమాలు కచ్చితంగా పాటించాలి. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయలను రోజూ తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవచ్చు. అవేంటో.. ఎందుకు తినాలో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే చక్కెర స్థాయిలు నియంత్రణంలో ఉండేందుకు మెడిసిన్ తీసుకోవడంతో పాటు లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్ గా మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు షుగర్ పెరగడానికి కారణం అవుతాయి. అలాగే కొన్ని రకాల కూరగాయలు చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అలా షుగర్ పేషెంట్లకు మేలు చేసే కొన్ని కూరగాయల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
25
బ్రోకలీ
డయాబెటిస్ నియంత్రణకు బ్రోకలీ అద్భుతమైన కూరగాయ. బ్రోకలీలో విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. రోజూ బ్రోకలీ తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
35
పాలకూర
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడే మెగ్నీషియం, ఐరన్, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు పాలకూరలో ఉన్నాయి. అంతేకాదు పాలకూరలోని యాంటీఆక్సిడెంట్లు.. కణాల నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. మంటను తగ్గిస్తాయి.
క్యారెట్ షుగర్ పేషెంట్లకు చాలా మంచిది. ఇందులో ఫైబర్, విటమిన్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా ప్రభావితం చేస్తుంది. క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి.
55
క్యాబేజీ
క్యాబేజీలోని విటమిన్ సి, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి. క్యాబేజీలోని యాంటీఆక్సిడెంట్లు మంటను తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి సహాయపడతాయి.