మనం ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో.. తిన్న తర్వాత కొన్ని నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు అస్సలు చేయకూడదట. అవేంటో.. ఎందుకు చేయకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకుంటే సరిపోదు. తిన్నది సరిగ్గా జీర్ణం కావాలన్నా.. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా తిన్న తర్వాత కొన్ని పనులు చేయకూడదు. ఎందుకంటే అవి జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. కొత్త సమస్యలకు దారితీస్తాయి. మరి భోజనం చేసిన తర్వాత ఏ పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
25
తిన్న వెంటనే పడుకోవద్దు
చాలామంది తిన్న వెంటనే నిద్రపోతుంటారు. కానీ అది ఆరోగ్యానికి మంచిదికాదు. తిన్నాక 2-3 గంటల తర్వాత పడుకోవడం మంచిది. లేకపోతే అజీర్తి వంటి సమస్యలు రావచ్చు.
ఎక్కువ నీళ్లు తాగకూడదు
సాధారణంగా చాలామంది భోజనం మధ్యలో కొంచెం కొంచెం నీరు తాగుతుంటారు. అలా తాగవచ్చు కూడా. కానీ భోజనం తర్వాత ఎక్కువ నీళ్లు తాగడం మంచిదికాదు. అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. తిన్నాక అరగంట తర్వాత వాటర్ తాగడం ఉత్తమం.
35
స్నానం చేయకూడదు
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చల్లటి నీళ్లతో స్నానం చేస్తే రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దీని వల్ల అజీర్తి, గ్యాస్ వస్తాయి. కాబట్టి తిన్న వెంటనే స్నానం చేయకపోవడం మంచిది.
కాఫీ, టీ, ఆల్కహాల్, సిగరెట్లు వద్దు:
తిన్న తర్వాత టీ, కాఫీ, ఆల్కహాల్, సిగరెట్ల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ లోని పోషకాలు శరీరానికి అందవు. జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది.
కొంతమంది తిన్న వెంటనే వ్యాయామం చేస్తుంటారు. దానివల్ల రక్త ప్రసరణ కండరాలకు మళ్లుతుంది. ఇది వికారం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి తిన్న వెంటనే కాకుండా.. 2 గంటల తర్వాత వ్యాయామం చేయాలి.
బరువులు ఎత్తకూడదు
తిన్న వెంటనే బరువులు ఎత్తితే కడుపు మీద ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి బరువులు ఎత్తకూడదు.
55
పండ్లు తినకూడదు
చాలామంది భోజనం చేసిన తర్వాత పండ్లు తింటుంటారు. పండ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ఫుడ్ తీసుకున్న వెంటనే తినడం మంచిది కాదు. దానివల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి 2 గంటల తర్వాత తినడం మంచిది.