60 ఏళ్ల వయసులో వేగంగా నడిస్తే ఆయుష్షు ఒక సంవత్సరం వరకు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాదు నెమ్మదిగా నడవడంతో పోలిస్తే.. వేగంగా నడవడం వల్ల క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. నడక మెదడు పనితీరుని పెంచుతుంది. నడక వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.