టీ, కాఫీని మళ్లీ మళ్లీ వేడిచేయకూడదు
మన ఇంటికి చుట్టాలు, స్నేహితులు వచ్చారనుకోండి వెంటనే వారికి టీ, కాఫీ ఇస్తుంటాం కదా. కాని ఒక్కోసారి పొద్దున్న ఎప్పుడో పెట్టిన టీ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని కాస్త వేడి చేసి సర్వ్ చేసేస్తుంటారు. అలాగే టీ దుకాణాల్లో కూడా ఎప్పుడో పెట్టిన టీని పదే పదే వేడి చేసి ఇస్తుంటారు. ఎంత టేస్టీగా ఉందో అనుకుంటూ తాగేస్తుంటాం. కాని వాస్తవానికి పదే పదే వేడి చేసే టీ, కాఫీల్లో పోషకాలన్నీ ఆవిరైపోతాయట. టీ ఆకుల్లో, కాఫీ గింజల్లో ఉండే రుచి కూడా మారిపోతుంది. అంతేకాకుండా హానికరమైన బ్యాక్టీరియా తయారై శరీరంలోకి చేరి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.