11 రోజులపాటు ఖాళీ కడుపుతో చియా సీడ్స్ వాటర్ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. చియా సీడ్స్ లో ఫైబర్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. నిపుణుల ప్రకారం ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ చియా సీడ్స్ వాటర్ తాగితే శరీరానికి వేగంగా శక్తి అందడమే కాకుండా, జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేస్తుంది.