సాధారణంగా చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగుతుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు జీలకర్ర వాటర్ తాగితే అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. హైడ్రేషన్ నుంచి బరువు నియంత్రణ వరకు కలిగే 5 ముఖ్యమైన లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణుల ప్రకారం ఉదయం పరగడుపున మాత్రమే కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగడం కూడా శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది. జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు శరీరంలోని చాలా సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి. రాత్రి పూట జీలకర్ర నీరు తాగడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యం
జీలకర్రలో ఉండే ఫైబర్, ప్రాక్టికల్ కంఫౌండ్స్ జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం కలిగి ఉంటాయి. రాత్రి పడుకునే ముందు చిన్న కప్పు జీలకర్ర నీరు తాగితే, జీర్ణక్రియ, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. లేటుగా భోజనం చేసేవారికి జీలకర్ర నీరు మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
36
విషపదార్థాల తొలగింపు
రాత్రి విశ్రాంతి సమయంలో శరీరం స్వతహాగా టాక్సిన్స్ ని బయటకు పంపుతుంది. జీలకర్ర నీరు కూడా శరీరంలోని విష కణాలను తగ్గించి, కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం దీర్ఘకాలం జీలకర్ర నీరు తాగిన వారు ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటారు.
జీలకర్రలో ఉండే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మినరల్స్ శరీరంలోని నాడీ వ్యవస్థకు విశ్రాంతినిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఈ నీరు తాగితే మైండ్ రిలాక్స్ అవుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. ఈ డ్రింక్ తాగే అలవాటు క్రమంగా నిద్ర సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
56
బరువు తగ్గడానికి..
జీలకర్ర నీరు మెటబాలిజం వేగాన్ని పెంచే గుణం కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ నీరు తాగడం వల్ల శరీరంలో అదనపు ఫ్యాట్ సరిగ్గా ప్రాసెస్ అవుతుంది. దీర్ఘకాలంలో ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
66
రోగనిరోధక శక్తి
జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు జీలకర్ర నీరు తాగడం ద్వారా, శరీరానికి రాత్రి విశ్రాంతి సమయంలో అవసరమైన న్యూట్రియంట్స్ అందుతాయి. దానివల్ల మరుసటి రోజు ఉదయం ఉత్సాహంగా ఉండటం, వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరగడం వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు జీలకర్ర నీరు శరీరానికి హైడ్రేషన్ ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.