Summer Skin Care: మండే ఎండల్లోనూ మెరిసే చర్మం.. ఇదొక్కటి చేస్తే చాలు

Published : Feb 25, 2026, 06:41 PM IST

Summer Skin Care: సమ్మర్ మొదలైందంటే చాలు ఇంట్లో ఉక్కపోత, బయటకొస్తే ఎండ. సూర్యకిరణాలు డైరెక్ట్ గా శరీరంపై పడటంతో చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశముంది. కొందరికి దద్దుర్లు, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. అందుకే స్కిన్ కేర్ రొటీన్ ను కాస్త మార్చుకోవడం అవసరం.

PREV
16
సమ్మర్ అంటే అందరికీ భయమే.

వేసవిలో డీ హైడ్రేషన్, తలనొప్పి, ఎండకు కళ్లు తిరగడం, చర్మ సమస్యలు, డేండ్రఫ్ పెరిగిపోవడం ఇలాంటివి కామన్ గా జరుగుతుంటుంది. అందుకే చాలా మంది బయటకు రావడానికే భయపడతారు. అలా అని బయటకు రాకుండా ఉండలేం కదా. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? 

సన్ ఎక్స్‌పోజర్, చెమట, కాలుష్యం వంటి కారణాల వల్ల స్కిన్ డ్రైగా మారడం, tan అవడం, పిగ్మెంటేషన్, స్కిన్ బ్రేక్ అవ్వడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

26
వేసవిలో స్కిన్ కేర్ టిప్స్

మొదటిగా సన్ ప్రొటెక్షన్ చాలా ముఖ్యం. రోజూ బయటికి వెళ్లకపోయినా కూడా సన్‌స్క్రీన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. కనీసం SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. బయట ఎక్కువసేపు ఉంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి మళ్లీ అప్లై చేయాలి. చెవులు, మెడ, చేతులు వంటి భాగాలను చాలామంది మర్చిపోతారు. ఇవి కూడా సూర్యకిరణాల వల్ల దెబ్బతింటాయి. అలాగే క్యాప్స్, సన్‌గ్లాసెస్, కాటన్ దుస్తులు ధరించడం మంచిది.

36
స్కిన్ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి

వేసవిలో చెమట వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీంతో స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. అలొవెరా వంటి హైడ్రేటింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయ, ఆరెంజెస్ వంటి పండ్లు తీసుకోవడం చర్మానికి ఉపయోగపడుతుంది. 

46
ఎక్స్‌ఫోలియేషన్ కూడా అవసరమే కానీ...

ఎక్స్‌ఫోలియేషన్ కూడా అవసరమే కానీ... జెంటిల్‌గా చేయాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మైల్డ్ ఎక్స్‌ఫోలియేటర్ ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగి స్కిన్ స్మూత్‌గా మారుతుంది. అయితే ఎండలో ఎక్కువసేపు ఉన్న రోజు వెంటనే ఎక్స్‌ఫోలియేట్ చేయకపోవడం మంచిది. 

56
సన్ స్క్రీన్ తప్పనిసరి

చెమట, సన్‌స్క్రీన్, ధూళి వల్ల చిన్న చిన్న రంధ్రాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మైల్డ్ క్లెన్సర్‌తో రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలి. ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల స్కిన్ డ్రై అవుతుంది. వేసవిలో హెవీ క్రీమ్స్ బదులుగా లైట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడటం మంచిది. ఆయిల్ ఫ్రీ, నాన్-కోమెడోజెనిక్ ప్రొడక్ట్స్ ఎంపిక చేసుకోవాలి.

కళ్ల చుట్టూ, పెదవులు చాలా సెన్సిటివ్. UV ప్రొటెక్షన్ ఉన్న సన్‌గ్లాసెస్ వాడాలి. SPF ఉన్న లిప్ బామ్ ఉపయోగించాలి. అలాగే వేడి నీటితో స్నానం చేయకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇంకా చన్నీళ్ల స్నానం అయితే ఇంకా బెటర్.

66
చిన్న మార్పులు పాటిస్తే హెల్తీ, గ్లోయింగ్‌ స్కిన్ మీదే

సరైన ఆహారం కూడా స్కిన్ కేర్ లో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ C, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల చర్మం లోపల నుంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ చిన్న మార్పులు పాటిస్తే వేసవిలో కూడా చర్మం హెల్తీగా, గ్లోయింగ్‌గా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories