How to Store Flour: పిండికి పురుగు పట్టొద్దంటే ఇలా చేయండి

Published : Sep 12, 2025, 05:42 PM IST

How to Store Flour: పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే ఖచ్చితంగా పురుగు పడుతుంది. పురుగు ఎక్కువగా పడితే పిండి పనికిరాకుండా అవుతుంది. కాబట్టి పిండికి పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
14
పిండిని ఇలా నిల్వ చేయండి

ఈ రోజుల్లో రోటీలను చాలా మంది రోజూ తింటుంటారు. అందుకే రోటీ పిండిని చాలా కొనేసి ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ పిండిని సరిగ్గా నిల్వ చేయకపోయినా, ఎక్కువ రోజులు ఉన్నా పురుగులు ఖచ్చితంగా పడతాయి. అలాగే ఎండ, తేమ, వల్ల కూడా పిండి పాడవుతుంది. ఇలాంటి పిండి పనికిరాకుండా పోతుంది. అందుకే పిండిని ఎలా నిల్వ చేస్తే పురుగులు పట్టకుండా ఫ్రెష్ గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

పిండిని ఇలా నిల్వ చేయండి

గాలి వెళ్లని డబ్బా..

గాలి వల్లే పిండి తేమగా అవుతుంది. దీంతో పురుగు పడుతుంది. కాబట్టి పిండిని ఎప్పుడైనా సరే గాలి వెళ్లని డబ్బాలో నిల్వ చేయండి. దీనివల్ల పిండికి పురుగు పట్టకపోవడమే కాకుండా.. ఎక్కువ రోజులు ఫ్రెష్ గా, రుచి మారకుండా ఉంటుంది. ఒక్క పిండే కాదు ఏ ఆహార పదార్థాలైనా సరే ఇలా నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి. గాలి వెళ్లని గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బాను వాడితే పిండి 10 నెలలైనా పాడవకుండా ఉంటుంది. వీటిలోకి పురుగు వెళ్లే ప్రసక్తే ఉండదు.

24
ఈ ప్రదేశంలో నిల్వ చేయండి

పిండికి పురుగు పట్టకూడదంటే కాంతి, వేడి, తేమ ఉన్న ప్రదేశంలో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఈ ప్రదేశాల్లోనే బ్యాక్టీరియా పెరుగుతుంది. పిండికి పురుగు పట్టకూడదంటే దీన్ని చల్లని లేదా పొడి లేదా చీకటి ప్రదేశంలో పెట్టడం మంచిది. తేమ ఎక్కువగా ఉంటే గనుక బ్యాక్టీరియా పెరుగుతుంది.

 దీంతో పిండి పనికిరాకుండా పోతుంది. అయితే పిండి ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మీరు దీన్ని ఫ్రిజ్ లో లేదా ఫ్రీజర్ లో పెట్టొచ్చు. ఇందుకోసం దీన్ని గాజు కూజా లేదా గాలి వెల్లని ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఫ్రిజ్ లో పెట్టండి. అయితే దీంట్లోకి గాలి అస్సలు వెళ్లకూడదు. మూత గట్టిగా పెట్టాలి. అప్పుడే పిండి పాడవకుండా ఉంటుంది.

34
స్టెయిన్‌లెస్ స్టీల్ కంటైనర్‌

తేమతోనే పిండి ఎక్కువగా పాడవుతుంది. తేమ వల్ల పిండికి పురుగు తొందరగా పడుతుంది. అయితే మీరు దీన్ని స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్ లో నిల్వ చేస్తే గనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అయితే దీనిలో పిండిని పోసే ముందు దాన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడవాలి.

బిర్యానీ ఆకు

బిర్యానీ ఆకుతో కూడా మీరు పిండిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చు. ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పురుగులకు, కీటకాలకు బిర్యానీ ఆకుల ఘాటైన వాసన అస్సలు నచ్చదు. కాబట్టి పిండి డబ్బాలో బిర్యానీ ఆకును వేస్తే పురుగులు రావు.

44
ఉప్పు

ఉప్పుతో కూడా పిండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముఖ్యంగా ఇది పురుగులు రాకుండా చేయడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం సగం డబ్బా పిండికి రెండు లేదా మూడు టీ స్పూన్ల ఉప్పును వేసి కలపండి. ఉప్పు కలపడం వల్ల పిండి ఎక్కువ రోజులు రుచి కోల్పోకుండా, ఫ్రెష్ గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories