Drumsticks: ఈ 5 మంది మునగకాయల్ని మాత్రం తినకూడదు తెలుసా?

Published : Sep 25, 2025, 02:02 PM IST

Drumsticks: కూరగాయల్లో ఒకటైన మునక్కాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పప్పు చారు, ఫ్రై ఇలా చాలా రకాల కూరల్లో మునక్కాయల్ని వేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం మునగకాయల్ని అస్సలు తినకూడదు. 

PREV
15
మునగకాయలు

మార్కెట్ లో మనకు ఎన్నో రకాల కూరగాయలు దొరుకుతాయి. నిజానికి కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో మునక్కాయలు ఒకటి. మునక్కాయల్ని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో చేసిన కూరలు టేస్టీగా ఉండటమే కాకుండా.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. 

మునక్కాయల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మునగకాయల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫాస్పరస్, పొటాషియం, ఇనుము, మెగ్నీషియం, జింక్, ఐరన్ సోడియం ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

 అందుకే మునగకాయల్ని, ఈ చెట్టు ఆకుల్ని, పువ్వుల్ని, వేర్లను, బెరడు, విత్తనాల్ని ఆయుర్వేదం, హోమియోపతి, ప్రకృతి వైద్యం వంటి ఎన్నో వైద్య విధానాల్లో ఉపయోగిస్తారు. ముగనమనకు చేసే మేలు ఎంతో అయినప్పటికీ.. ఈ మునక్కాయల్ని మాత్రం కొంతమంది అస్సలు తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
మునగకాయల్ని ఎవరు తినకూడదు?

తక్కువ బీపీ ఉన్నవారు

రక్తపోటు కొంతమంది ఎక్కువగా ఉంటే.. మరికొంతమందికి మాత్రం ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీరు ఏవి పడితే అవి తింటుంటారు. కానీ తక్కువ రక్తపోటు ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను అస్సలు తినకూడదు. వాటిలో మునగకాయలు కూడా ఉన్నాయి. అవును బీపీ తక్కువగా ఉన్నవారు మునగకాయల్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది బీపీని వెంటనే తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. మీకు ఇప్పటికే బీపీ తక్కువగా ఉంటే.. వీటిని తింటే మరింత తక్కువ అవుతుంది. కాబట్టి బీపీ తక్కువగా ఉంటే వీటిని తినకండి. కానీ రక్తపోటు ఎక్కువగా ఉన్నవారు మాత్రం వీటిని తినొచ్చు. ఇవి బీపీని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

గర్భిణీ స్త్రీలు

గర్భిణీ స్త్రీలు కూడా ఏవి పడితే అవి తినకూడదు. వీరు తినకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి. వీటిలో మునక్కాయలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీటిలో వేడి చేసే గుణం ఉంటుంది. కాబట్టి మీరు మునగకాయల్ని ఎక్కువగా తింటే రక్తస్రావం, గర్భస్రావం అవుతుంది. ఇప్పటికీ మీకు ఈ సమస్య ఉంటే అస్సలు తినకూడదు. మోతాదులో తింటేనే మంచిది. అందుకే వీటిని తినాలో లేదో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా గర్భందాల్చిన మూడు నెలలు వీటిని మొత్తమే తినకపోవడమే మంచిది. అంతేకాదు మునక్కాయల్ని ఎక్కువగా తింటే గ్యాస్, బీపీ తగ్గడం, విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే పాలిచ్చే వారు, అలెర్జీ, ఆస్తమా ఉన్నవారు కూడా మునగకాయల్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఆస్తమా, అలెర్జీని పెంచే లక్షణాలు ఉంటాయట. అందుకే వీళ్లు కూడా మునక్కాయల్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తారు.

35
మునక్కాయల్ని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

మునగకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుకలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణవ్యవస్థకు మంచిది

ముగనకాయలు మన జీర్ణవ్యవస్థకు మంచి మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారాన్ని సులువుగా అరిగేలా చేస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.

ఎముకలు బలంగా ఉంటాయి

ముగనకాయల్ని తింటే మన ఎముకలు బలంగా ఉంటాయి. వీటిలో కాల్షియం, ఫాస్పరస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎముకల్ని బలంగా ఉంచడానికి సహాయపడతాయి. వీటిని తింటే ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందది. వీటిలో విటమిన్ ఎ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన కంటిచూపును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. చిన్న పిల్లలు వీటిని తింటే వారి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

45
గుండెకు మంచివి

గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా మునగకాయలు సహాయపడతాయి. వీటిని తింటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా ఈ కాయలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముగనకాయల్ని పప్పు, సూప్, కూరల్లో వేసుకుని తింటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మీరు ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంటారు.

55
కిడ్నీ పేషెంట్లకు మంచివి

మూత్రపిండాలు సరిగ్గా పనిచేయని వారికి మూత్ర విసర్జన సరిగ్గా జరగదు. ఇలాంటి వారికి మునగకాయలు సహాయపడతాయి. ఈ మునగచెట్టు ఆకులు, పువ్వులు, గింజలు, వేర్లు కూడా కిడ్నీ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడటానికి కారణమయ్యే ఆక్సలేట్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అందుకే కిడ్నీ పేషెంట్లు మునగకాయల్ని ఎలాంటి భయం లేకుండా తినొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories