పిల్లలు నవ్వాలని చాలా మంది గిలిగింతలు పెడుతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. అవేంటంటే?
Image credits: pinterest
Telugu
గిలిగింతలు పెట్టడం ఎందుకు మంచిది కాదు?
చైల్డ్ స్పెషలిస్ట్ ప్రకారం.. పిల్లలకు గిలిగింతలు పెట్టినప్పుడు వారు గట్టిగా నవ్వుతుంటారు. కానీ ఈ నవ్వు ఒక సహజ ప్రతిచర్య మాత్రమే. అంటే మీ పిల్లలు నిజంగా సంతోషంగా ఉన్నారని కాదు.
Image credits: pinterest
Telugu
గిలిగింతలు పెట్టినప్పుడు పిల్లల శరీరంలో ఏం జరుగుతుంది?
గిలిగింతల వల్ల పిల్లల శ్వాస కొన్ని సెంకడ్స్ పాటు ఆగిపోతుంది. దీంతో పిల్లల కండరాలు బిగుసుకుపోతాయి. అలాగే శరీరం విశ్రాంతి తీసుకోలేదు.
Image credits: pinterest
Telugu
హృదయ స్పందన పెరగడం
పిల్లలు గిలిగింతల వల్ల నవ్వడం వల్ల వారి గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది చిన్న పిల్లలకు చాలా డేంజర్.
Image credits: pinterest
Telugu
ఒత్తిడి హార్మోన్ల పెరుగుదల
గిలిగింతలు పెట్టడం వల్ల పిల్లల శరీరంలో ఒత్తిడి హార్మోన్ పెరిగి వారు అసౌకర్యంగా ఉంటారు.
Image credits: pinterest
Telugu
గిలిగింతలు ఎందుకు ప్రమాదకరం
గిలిగింతల వల్ల వచ్చిన సమస్యలను పిల్లలు తమ మాటల్లో చెప్పలేరు. వారు పైకి నవ్వుతున్నా లోపల వారి శరీరం ఒత్తిడికి, ఆందోళనకు గురికావొచ్చని నిపుణులు అంటున్నారు.