Weight Loss: బరువు తగ్గాలనుకునే వారు ఈ పండ్లను మాత్రం తినకూడదు

Published : Sep 23, 2025, 01:27 PM IST

Weight Loss: పండ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలోని పోషకాలు మనల్ని హెల్తీగా ఉంచడానికి సహాయపడతాయి. అయినా కానీ బరువు తగ్గాలనుకునే వారు మాత్రం కొన్ని రకాల పండ్లను అస్సలు తినకూడదు. అవేంటి? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

PREV
17
వెయిట్ లాస్

పండ్లు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని హెల్తీగా ఉంచి బరువు తగ్గడానికి సహాయపడతాయి. అందుకే మనం రకరకాల పండ్లను తింటుంటాం. కానీ బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకాల పండ్లు మంచివి కావు. అంటే ఇవి మీ బరువును మరింత పెరిగేలా చేస్తాయి. అంటే వీటిలో బరువును పెంచే షుగర్స్, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఏయే పండ్లను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
అరటిపండు

బరువు తగ్గాలనుకునేవారు అరటిపండును తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ పండులో కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే కార్బోహైడ్రేట్లు, నేచురల్ షుగర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వారు వీటిని ఎక్కువగా తినకూడదు. లేదంటే మీరు బరువు పెరగడమే కానీ తగ్గడం ఉండదు. 

37
గ్రేప్స్

గ్రేప్స్ టేస్టీగా, తీయగా ఉంటాయి. అందుకే వీటిని ప్రతిఒక్కరూ ఇష్టంగా ఉంటారు. వీటిని కొన్ని తినాలకునేవారు కూడా ఎక్కువగా తినేస్తుంటారు. వీటి టేప్ట్ అలా ఉంటుంది మరి. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు మాత్రం ఈ పండ్లను తక్కువగా తినాలి. ఎందుకంటే వీటిలో కేలరీలు, నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును మరింత పెంచుతాయి. అందుకే వీటిని లిమిట్ గానే తినాలి. 

47
మామిడిపండు

టేస్టీ టేస్టీ పండ్లలో మామిడి పండు ఒకటి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్సి ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అయితే ఈ పండ్లలో నేచురల్ షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మామిడి పండ్లను ఎక్కువగా తింటే గనుక మీరు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా బరువు పెరగకూడదు అనుకునే వారు. 

57
పైనాపిల్

పైనాపిల్ మంచి హెల్తీ ఫ్రూట్. దీనిలో ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ పండు మనల్ని ఎన్నో సమస్యలకు దూరంగా ఉంచేందుకు సహాయపడుతుంది. కానీ ఈ పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఈ పండును ఎక్కువగా తింటే మీరు బరువు తగ్గరు. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు పైనాపిల్ పండును తినకపోవడమే మంచిది. 

67
దానిమ్మ

దానిమ్మ పండు శరీరంలో రక్తాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పండులో ఐరన్, విటమిన్లు మెండగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా, హెల్తీగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. వ్యాయామానికి ముందు దానిమ్మపండును తింటే చాలా మంచిది. కానీ వ్యాయామం తర్వాత ఈ పండును తినకూడదు. ఎందుకంటే దీనిలోని నేచురల్ షుగర్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. అలాగే మీరు బరువు కూడా పెరుగుతారు. 

77
అవకాడో

అవొకాడో ఆరోగ్యానికి చాలా మంచిది.దీనిలో పోషకాలు, హెల్తీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అయినా కూడా దీన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే దీనిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువును మరింత పెంచుతుంది. బరువు తగ్గాలనుకుంటే మాత్రం అవొకాడోను ఎక్కువగా తినకూడదు. 

Read more Photos on
click me!

Recommended Stories