Health: ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా? లివ‌ర్ డ్యామేజ్ కావ‌డం ఖాయం

Published : Jun 08, 2025, 02:01 PM ISTUpdated : Jun 08, 2025, 02:02 PM IST

మన ఆరోగ్యం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. అయితే ఉదయం తీసుకునే ఆహారం లివర్ పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోకూడని కొన్ని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
15
చూడ్డానికి బాగున్నా.?

చాలామంది ఉదయం టీ, పండ్లు, టిఫిన్ తో మొదలు పెడతారు. కానీ మీరు తినే కొన్ని పదార్థాలు లివర్‌కి హాని చేస్తాయని మీకు తెలుసా? ముఖ్యంగా తెల్లటి పదార్థాలు చూడటానికి బాగున్నా లివర్‌కి హాని చేస్తాయి. ఏవి ఆ తెల్లటి పదార్థాలు, అవి మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?

25
బ్రెడ్ మంచిది కాదు

చాలామంది ఉదయం టిఫిన్‌కి వైట్ బ్రెడ్ తింటారు. బ్రెడ్‌తో బటర్ లేదా జామ్ తినడం అలవాటు. కానీ మైదాతో చేసిన తెల్ల బ్రెడ్ లివర్‌కి హానికరమని నిపుణులు చెబుతున్నారు. 

35
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

 తెల్ల బ్రెడ్ మైదాతో తయారవుతుంది. ఇందులో ఫైబర్ ఉండదు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువ. ఇది తిన్నప్పుడు, శరీరంలో చక్కెరలా పనిచేసి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

ఫ్యాటీ లివర్: రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్‌లో కొవ్వు పేరుకుపోతుంది, దీన్ని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు.

ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది: తెల్ల బ్రెడ్ ఎక్కువగా తినడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, టైప్ 2 డయాబెటిస్, లివర్ సమస్యలు వస్తాయి.

45
లివర్ సమస్యలల్లో కనిపించే ల‌క్ష‌ణాలు ఇవే

అలసట
కడుపు ఉబ్బరం
చర్మం పసుపు రంగులోకి మారడం
ఆకలి లేకపోవడం
బలహీనత.

55
మరి ఏం తినాలి.?

ఉదయం టిఫిన్ చాలా ముఖ్యం. అందులో ఒక చిన్న తప్పు కూడా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మీరు ప్రతిరోజూ తెల్ల బ్రెడ్ తింటుంటే, ఇప్పుడు మీ అలవాటు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. 

ఆరోగ్యకరమైన రోజు మంచి టిఫిన్‌తో మొదలవ్వాలి. అంటే మీరు ఉదయాన్నే ఓట్స్, పోహా లేదా పన్నీర్ పరాఠా తినవచ్చు. ఇది మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories