Non Vegetarian Foods ఓరినాయనో.. ఈ పదార్థాలు వెజ్ కాదు నాన్ వెజా??

కొందరు పొరపాటున కూడా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడరు. మేం పూర్తిగా శాఖాహారమే తింటాం అని చెప్పుకొంటుంటారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. వాళ్లకు తెలియకుండానే నాన్ వెబ్ భుజిస్తుంటారు. నిజానికి వాళ్లు వెజ్ అని భావించే కొన్ని పదార్థాలు సైతం మాంసాహారానికి సంబంధించినవే. అవేంటో చూద్దాం!

Surprising non vegetarian foods many vegetarians eat in telugu

ప్రపంచంలో చాలా రకాల ప్రజలున్నారు. కొందరు వెజిటేరియన్ ఫుడ్ ఇష్టపడతారు, కొందరు నాన్-వెజిటేరియన్ ఫుడ్ ఇష్టపడతారు. అందుకే మార్కెట్లో చాలా రకాల ఫుడ్స్ దొరుకుతాయి. కానీ వెజ్ అనుకుని తింటాం, కానీ అవి నాన్-వెజ్ ఫుడ్స్. ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.

Surprising non vegetarian foods many vegetarians eat in telugu
నూనెల్లో చేపనూనె

మనం తినే ఫుడ్స్‌లో చాలా ఆయిల్ వాడుతుంటారు. మీరు ప్యూర్ వెజిటేరియన్ అయితే, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉందో లేదో చెక్ చేయండి. కొన్ని రకాల నూనెల్లో విటమిన్ డి కోసం చేప నూనెను కలుపుతారు. 


పెరుగులో జెలటిన్

పెరుగును పాలనుంచే చేస్తారు, అవి పూర్తి శాఖాహారం అని అంటుంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే..  మార్కెట్లో కొనే పెరుగులో రుచి కోసం జెలటిన్ కలుపుతారు. జెలటిన్ వెజిటేరియన్ కాదని గుర్తుంచుకోండి.

చక్కెరలో ఎముకల పొడి

వైట్ షుగర్‌లో నేచురల్ కార్బన్ వాడుతారు. అది జంతువుల ఎముకల నుంచి తీస్తారని తెలిస్తే షాక్ అవుతారు. ఫ్రూట్ జామ్ పేరుతో అమ్మే ప్రతి జామ్ ప్యూర్ వెజిటేరియన్ కాదు. జంతువుల శరీరంలో ఉండే జెలటిన్‌ను జామ్ చేయడానికి వాడుతారు.

కేక్ లో గుడ్డు

బేకరీల్లో దొరికే కేక్, పేస్ట్రీ లేదా ఫ్రూట్ కేక్స్‌ను ప్యూర్ వెజిటేరియన్ అనుకునే తప్పు చేయకండి. ఎందుకంటే కేక్ చేసేటప్పుడు గుడ్డు వేస్తారు. అందుకే కేక్ కొనేముందే అందులో ఎగ్ కలిపారా? లేదా అని చెక్ చేసుకోండి. మార్కెట్లో దొరికే డోనట్స్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు. కానీ కొన్ని రకాల డోనట్స్‌లో బాతు ఈకల్లో ఉండే ఎల్-సిస్టీన్ ఉంటుంది.

మార్కెట్లో దొరికే డోనట్స్‌ను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కానీ కొన్ని డోనట్స్‌లో బాతు ఈకల్లో ఉండే ఎల్-సిస్టీన్ ఉంటుంది.

Latest Videos

vuukle one pixel image
click me!