ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతుంటారు. చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ చాలామంది నాన్ వెజ్ తినని వాళ్లు కూడా ఉంటారు. మరి వారికి ప్రోటీన్ ఎలా అందుతుంది. వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది? నాన్ వెజ్ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఉండే పప్పు ఒకటి ఉంది. అదెంటో తెలుసా? తెలుసుకుందాం పదండి.
శరీరానికి అవసరమైన పోషకాల్లో ప్రోటీన్ ఒకటి. ఇది కండరాలను బలోపేతం చేసి శరీరానికి కొత్త శక్తినిస్తుంది. మనం తినే చికెన్, మటన్ లాంటి అనేక ఆహార పదార్థాల్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. కానీ నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తినేవాళ్లకి అవసరమైన ప్రోటీన్ కావాలంటే ఏం తినాలి? ఎక్కువగా ఆలోచించకండి. మీ ఆహారంలో ఒక రకమైన పప్పు చేర్చుకుంటే చాలు. దాంట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరి ఆ పప్పు ఏంటో ఓ సారి తెలుసుకోండి.
26
పెసరపప్పు
చికెన్, మటన్ లో కంటే కూడా పెసర పప్పులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండటానికి పెసర పప్పు సహాయపడుతుందని అంటున్నారు. వారానికి 2-3 సార్లు పెసర పప్పును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
36
పెసరపప్పులో ఉండే పోషకాలు:
పెసర పప్పులో ప్రోటీన్ కాకుండా ఫైబర్, విటమిన్ ఎ, బి, సి, ఇ, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా ముఖ్యమైనవి. అంతేకాదు పెసర పప్పు రుచిగా ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
46
పెసరపప్పు ప్రయోజనాలు:
1. పెసర పప్పు సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కాబట్టి మలబద్ధకం సమస్య ఉంటే పెసర పప్పు తినడం మంచిది.
2. పెసర పప్పు కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్, ఇనుము, మెగ్నీషియం, రాగి, పొటాషియం, విటమిన్లు శరీరానికి వరం.
3. పెసర పప్పు గుండెకు మంచిదని చెబుతారు. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
56
చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా..
4. పెసర పప్పులో ప్రోటీన్ వంటి పోషకాలు ఉండటం వల్ల ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది. దీనివల్ల శరీరంలో ఎలాంటి కొవ్వు నిల్వ ఉండదు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంచి కొవ్వును పెంచడం ద్వారా చెడు కొవ్వును నియంత్రిస్తాయి.
5. పెసర పప్పులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉండటం వల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ పప్పు మధుమేహ రోగులకు కూడా మంచిది.
66
చర్మ ఆరోగ్యానికి..
6. పెసర పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇది నల్ల మచ్చలను తగ్గించడానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. ఇది జుట్టును బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.
7. పెసర పప్పులో కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి అనువైన ఆహారం. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఆకలిని తగ్గించి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను ఇస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి పెసర పప్పు చాలా ప్రయోజనకరం.