Constant Hunger పదేపదే ఆకలి..! సమస్యకిలా చెక్!

Published : Apr 06, 2025, 09:40 AM IST

కొందరికి ఎంత తిన్నా మళ్లీ మళ్లీ ఆకలి వేస్తుంది.  మళ్లీ మళ్లీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. చెప్పాలంటే ఇది ఒకరకంగా ఆరోగ్య సమస్యనే. ఆకలి లేకున్నా తినాలనిపించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది హార్మోన్ల సమస్యకు సూచన కావచ్చు. ఎందుకిలా అవుతుంది? దాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాం..

PREV
14
Constant Hunger పదేపదే ఆకలి..! సమస్యకిలా చెక్!
అంతా మన చేతుల్లోనే..

కొన్ని సమస్యలకు పరిష్కారాలు మన చేతుల్లోనే ఉంటాయి. అతి ఆకలి కూడా మనం తేలికగా తగ్గించుకోవచ్చు. మీకు ఎంత ఆకలి వేసినా రోజూ ఒకే సమయంలో తినడం, నిద్రపోవడం అలవాటు చేసుకోండి. శారీరక శ్రమ సక్రమంగా ఉండాలంటే, జీవక్రియలు సరిగ్గా జరగాలంటే ప్రతిరోజు ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి.

24

సమస్య తగ్గించాలని అసలే ఆహారం తీసుకోకుండా ఉండొద్దు. తగినంత ఆహారం తీసుకోకుండా నిద్రపోతే అనేక రకాల శారీరక సమస్యలు వస్తాయి. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఏమీ తినకుండా నిద్రపోవద్దు. అలాగే తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. ఆహారం తీసుకోకపోతే శరీరం బలహీనంగా మారుతుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేము. రక్తంలో చక్కెర స్థాయి పడిపోవచ్చు.

34
ఆకలి లేకున్నా తినాలనిపించడం!

ఆకలి లేకున్నా తినాలనిపించడం లేదా ఎప్పుడూ ఏదో ఒకటి తినాలని అనిపించడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఆకలి వేసిన వెంటనే 'వద్దు' అని చెప్పండి.  ఆకలి వేసిన వెంటనే ఆహారం తినకూడదు. కాస్త సమయం ఇవ్వాలి.  ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగకూడదు. ఆహారం తినడానికి ముందు లేదా తిన్న తర్వాత అరగంటకు నీరు త్రాగాలి. దీనివల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.

44
నెమ్మదిగా నమిలి తినే అలవాటు చేసుకోండి.

తినేటప్పుడు పోటీ పడకుండా నెమ్మదిగా నమిలి తినే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే తొందరగా తింటే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.  తేలికపాటి ఆహారంతో రోజును ప్రారంభించండి. ఉదయం పూట తేలికపాటి ఆహారంతో రోజును ప్రారంభించండి. అల్పాహారంలో పోషకాలు ఉండేలా చూసుకోండి. ఇలా చేయడం వల్ల తప్పకుండా అతి ఆకలి సమస్య క్రమంగా తీరుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories