South Goa Food: సౌత్ గోవాలో ది బెస్ట్ హోటల్స్ ఇవే.. మార్టిన్స్ కార్నర్ నుంచి జెస్ట్ కేఫ్ వరకు టాప్ 9 ప్లేసెస్!

Published : Apr 30, 2026, 11:30 PM IST

Best Seafood Goa: మీరు అచ్చమైన గోవా సీఫుడ్ తినాలనుకున్నా, గ్లోబల్ వంటకాలు రుచి చూడాలనుకున్నా, లేదా బీచ్ పక్కన రొమాంటిక్ డిన్నర్ చేయాలనుకున్నా... సౌత్ గోవా రెస్టారెంట్లు మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

PREV
110
గోవా వెళ్తున్నారా? ఈ 9 హోటళ్లలో తినకపోతే మీ ట్రిప్ వేస్టే!

దక్షిణ గోవా అంటే కేవలం ప్రశాంతమైన బీచ్‌లు, అలలు మాత్రమే కాదు.. అక్కడ దొరికే నోరూరించే వంటకాలు కూడా పర్యాటకులను ఫిదా చేస్తాయి. స్పెషల్ సీఫుడ్ తినాలనుకున్నా, గ్లోబల్ వంటకాలను రుచి చూడాలనుకున్నా లేదా సముద్రపు ఒడ్డున రొమాంటిక్ డిన్నర్ చేయాలనుకున్నా.. సౌత్ గోవాలో అందుకు తగ్గ రెస్టారెంట్లు బోలెడు ఉన్నాయి. తక్కువ బడ్జెట్ నుంచి లగ్జరీ డైనింగ్ వరకు, మీరు తప్పక సందర్శించాల్సిన 9 అద్భుతమైన హోటళ్లను గమనిస్తే..

210
1. ట్రీటాప్ తవా, అగోండా

అగోండా బీచ్ దగ్గర ఎత్తైన ప్రదేశంలో ఉండే ఈ రెస్టారెంట్ పర్యాటకులకు ఎంతో ఇష్టమైనది. ఇక్కడ కూర్చుని భోజనం చేస్తుంటే సముద్రపు అందాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ దొరికే సీఫుడ్ ప్లాటర్లు, కాక్‌టెయిల్స్ చాలా ఫేమస్. మీరు అగోండా వైపు వెళ్తే ఈ ట్రీటాప్ తవాను అస్సలు మిస్ అవ్వకండి.

310
2. పెంటాగన్, మజోర్డా

స్థానికులు ఎక్కువగా ఇష్టపడే హోటళ్లలో పెంటాగన్ ఒకటి. ఇక్కడ గోవా వంటకాలతో పాటు ఇండియన్, సీఫుడ్ వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ధరలు కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. వంటకాల క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీతో కలిసి వెళ్లే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మజోర్డా ప్రాంతంలో తక్కువ ఖర్చుతో మంచి భోజనం చేయాలంటే పెంటాగన్ మంచి అప్షన్.

410
3. కేవటినా బై అవినాష్ మార్టిన్స్, బెనాలిమ్

గోవా వంటకాలను సరికొత్తగా, మోడ్రన్ పద్ధతిలో రుచి చూడాలనుకుంటే కేవటినాకు వెళ్లాల్సిందే. ప్రఖ్యాత చెఫ్ అవినాష్ మార్టిన్స్ స్థానిక రుచులకు ఆధునిక మెరుగులు దిద్ది వడ్డిస్తారు. ఇది ఒక ఫైన్ డైనింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఆహార ప్రియులకు, ముఖ్యంగా వంటల్లో వైవిధ్యాన్ని కోరుకునే వారికి ఈ రెస్టారెంట్ ఒక స్వర్గధామంలా అనిపిస్తుంది.

510
4. ది రెడ్ జింజర్, కోల్వా

కోల్వాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో ఉన్న ఈ రెస్టారెంట్ ఏషియన్ వంటకాలకు పెట్టింది పేరు. సుషీ నుంచి థాయ్ కర్రీస్ వరకు ఇక్కడ అన్నీ లభిస్తాయి. లోపల ఇంటీరియర్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. నాణ్యమైన ఆహారం, లగ్జరీ వాతావరణం కోరుకునే వారు ఈ రెడ్ జింజర్‌ను ఎంచుకోవచ్చు. దక్షిణ గోవాలో బెస్ట్ ఏషియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే అందరూ చెప్పే పేరు ఇదే.

610
5. ది ఫిషర్‌మెన్స్ వార్ఫ్, కావెలోసిమ్

నదీ తీరాన ఉండే ఈ రెస్టారెంట్ పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడి వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఇక్కడ భోజనం చేయడం ఒక సరికొత్త అనుభూతి. ఇక్కడ దొరికే స్టఫ్డ్ క్రాబ్, ఫిష్ కర్రీ రైస్ చాలా పాపులర్. ఆహారంతో పాటు ఇక్కడి వాతావరణం కూడా మీ మనసు దోచుకుంటుంది.

710
6. మార్టిన్స్ కార్నర్, బెటల్బాటిమ్

గోవా వెళ్లిన వారు మార్టిన్స్ కార్నర్ గురించి వినకుండా ఉండరు. ఇది గోవాలో ఒక ఐకానిక్ రెస్టారెంట్. ఇక్కడి గోవా రుచులు, తాజా సీఫుడ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రాన్ బల్చావో, రెచెడో ఫిష్, క్రాబ్ మసాలా వంటి వంటకాలు ఇక్కడ తప్పక తినాలి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ హోటల్‌లో గోవా నిజమైన వైబ్ మీకు కనిపిస్తుంది.

810
7. ది సదరన్ డెక్, బెనాలిమ్

బీచ్ ఒడ్డున ఊయలలు, కలర్‌ఫుల్ డెకరేషన్.. ఇదే సదరన్ డెక్ ప్రత్యేకత. స్టైలిష్‌గా సీసైడ్ డైనింగ్ చేయాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ సీఫుడ్‌తో పాటు వివిధ రకాల కాక్‌టెయిల్స్, డెజర్ట్‌లు చాలా బాగుంటాయి. సూర్యాస్తమయాన్ని చూస్తూ ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవ్వడానికి ఇది బెస్ట్ స్పాట్.

910
8. గుడ్‌ఫెల్లాస్, బెనాలిమ్

గోవాలో ఉండి ఇటాలియన్ ఫుడ్ తినాలనిపిస్తుందా? అయితే గుడ్‌ఫెల్లాస్‌కు వెళ్లండి. ఇక్కడ దొరికే ఉడ్-ఫైర్డ్ పిజ్జాలు, ఫ్రెష్ పాస్తా అసలైన ఇటాలియన్ రుచిని అందిస్తాయి. గోవా వంటకాలు కాకుండా వేరే వెరైటీ కావాలనుకునే వారికి దక్షిణ గోవాలో ఇది ఒక గొప్ప ప్రదేశం.

1010
9. జెస్ట్ కేఫ్, అగోండా

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, బ్రంచ్ కోసం జెస్ట్ కేఫ్ కేరాఫ్ అడ్రస్. స్మూతీ బౌల్స్, షక్షుకా, పాన్‌కేక్స్, ఆర్టిసానల్ కాఫీ ఇక్కడ చాలా స్పెషల్. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపే పర్యాటకులు, కాఫీ ప్రియులు అగోండాలోని ఈ కేఫ్‌ను విపరీతంగా ఇష్టపడతారు. దీని వాతావరణం కూడా చాలా కూల్‌గా, రిలాక్సింగ్‌గా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories