ఇప్పుడు సిద్ధం చేసుకున్న తాలింపును అన్నం, పెరుగు మిశ్రమంలో వేయండి. దీనితో పాటు వేయించిన పల్లీలు, సన్నగా తరిగిన దోసకాయ, దానిమ్మ గింజలను కలపండి. పల్లీలు పెరుగన్నానికి కరకరలాడే (Crunchy) అనుభూతిని ఇస్తే, దోసకాయ, దానిమ్మ గింజలు కొత్త రుచిని, తాజాదనాన్ని అందిస్తాయి.
అన్నింటినీ ఒకసారి బాగా కలిపితే, నోరూరించే దక్షిణ భారత స్టైల్ పెరుగన్నం సిద్ధం. దీన్ని వెంటనే తినొచ్చు లేదా కాసేపు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది.
కొన్ని చిట్కాలు:
పెరుగు ఎక్కువగా పుల్లగా ఉంటే, కొద్దిగా పాలు కలపడం వల్ల రుచి బ్యాలెన్స్ అవుతుంది. అదనపు రుచి కోసం సన్నగా తరిగిన అల్లం, కొత్తిమీర కూడా వాడుకోవచ్చు. పెరుగన్నంలోకి మామిడికాయ ఆవకాయ లేదా వడియాలు ఉంటే.. ఆ మజాయే వేరు! ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ పెరుగన్నాన్ని ఈరోజే మీ ఇంట్లో ట్రై చేసి భోజనాన్ని ఎంజాయ్ చేయండి.