- ఖర్జూరాలను పాలలో లేదా నీళ్లలో నానబెట్టి తింటే అవి తొందరగా అరుగుతాయి.
- ఎండు ఖర్జూరాల్లో కంటే నానబెట్టిన ఖర్జూరాల్లో షుగర్ తక్కువగా ఉంటుంది. వీటిని షుగర్ పేషెంట్లు తినొచ్చు. కానీ ఎక్కువ మాత్రం తినకూడదు.
నానబెట్టిన ఖర్జూరాలు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. వీటిని తింటే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
- రెగ్యులర్ గా పరిగడుపున 4 నానబెట్టిన ఖర్జూరాలను తింటే శరీరంలో పోషకాల లోపం పోతుంది. అలాగే శరీరం ఆహారం నుంచి మరింత సమర్థవంతంగా పోషకాలను గ్రహిస్తుంది.
- ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఎసిడిటీ, మలబద్దకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారికి నానబెట్టిన ఖర్జూరాలే మంచివి.