గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటి వరకు ఈ గింజలను పచ్చిగా లేదంటే.. కొంచెం రోస్ట్ చేసి తిని ఉంటారు. కానీ.. వీటిని ఎప్పుడైనా నానపెట్టి తిన్నారా? అలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
24
రోగనిరోధక శక్తి పెరుగుతుంది...
గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా తెల్ల రక్త కణాలు మన శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్ల తో పోరాడటానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ వీటిని తినడంతో పాటు.. ఇతర ఆహారం కూడా ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి.
గుండె ఆరోగ్యం..
గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును స్థిరంగా ఉంచడంలో , రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. కేవలం ఒకటి రెండు రోజులు తిని...అద్భుతాలు జరిగిపోవాలి అంటే కుదరదు. క్రమం తప్పకుండా ప్రతిరోజూ వాటిని మీ డైట్ లో భాగం చేసుకోవాలి.
34
రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది:
గుమ్మడికాయ గింజలలో లభించే మెగ్నీషియం, ఇన్సులిన్ నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కానప్పటికీ, ఆరోగ్యకరమైన అలవాట్లతో కలిపితే రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
ఎముకలను బలపరుస్తుంది:
మెగ్నీషియం , భాస్వరం వంటి పోషకాలు బలమైన ఎముకలకు అవసరం. నానబెట్టిన గుమ్మడికాయ గింజలు ఈ రెండింటినీ అందిస్తాయి. కొన్ని నెలల పాటు నిరంతంర వాటిని తినడం వల్ల ఎముకల నష్టం నుండి రక్షణ కవచం లభిస్తుంది.
నానబెట్టిన గుమ్మడికాయ గింజలు మృదువుగా , జీర్ణం కావడానికి సులభంగా ఉంటాయి. అవి కొంచెం ఫైబర్‌ను కూడా అందిస్తాయి. ఈ ఫైబర్ సజావుగా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ప్రేగుల సహజ కదలికను నిర్వహిస్తుంది. రెగ్యులర్ గా క్రమం తప్పకుండా వీటిని తింటే.. మలబద్దకం సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది.
కంటి ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి
గుమ్మడికాయ గింజలు విటమిన్ E వంటి యాంటీఆక్సిడెంట్లకు పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కంటి ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. చర్మాన్ని అందంగా మార్చడంలోనూ సహాయపడతాయి.
గమనిక: వారం రోజులు వరసగా ఈ గుమ్మడి గింజలను తిని.. తమకు ప్రయోజాలు కలగాలి అంటే కుదరదు. వీటిని కచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే.. మీరు కోరుకున్న ప్రయోజనాలు లభిస్తాయి. అయితే.. ఏదైనా ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది. వైద్యుల సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి.