వర్షాకాలంలో చాలామంది తరచుగా జబ్బుపడుతుంటారు. ఈ సీజన్ లో ఎక్కువగా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి బలమైన రోగనిరోధక శక్తి అవసరం. కొన్ని రకాల ఆహారాలు ఇమ్యూనిటీ పెరగడానికి సహాయపడతాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
మన శరీరాన్ని రకరకాల వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. ఇమ్యూనిటీ బలంగా ఉన్నప్పుడే ఎలాంటి వ్యాధులు మన దరిచేరవు. కొన్ని ఆహార పదార్థాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన కొన్ని ఆహార పదార్థాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
27
పసుపు
పసుపులో కర్క్యుమిన్ అనే సహజ సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు శరీరం ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
37
తులసి
తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి చక్కగా సహాయపడుతుంది. తులసి యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లు, ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడుతుంది.
విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉన్న ఉసిరికాయ రసం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులోని విటమిన్ సి తెల్ల రక్త కణాలను బలపరుస్తుంది. ఇది ఇన్ఫెక్షన్లు, వైరస్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
57
మొక్కజొన్న
మొక్కజొన్న కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మొక్కజొన్న లోని ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. రోగనిరోధక కణాల పనితీరును ప్రోత్సహిస్తాయి.
67
కాకరకాయ
కాకరకాయలో విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతాయి.
77
నేరేడు పండ్లు
నేరేడు పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరిచి సీజనల్ వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి.