Mutton: ఈసారి మ‌ట‌న్ కొంటే ఈ పార్ట్‌ను క‌చ్చితంగా తీసుకోండి.. రుచి మాత్ర‌మే కాదు ఆరోగ్యం కూడా

Published : May 05, 2026, 12:13 PM IST

Mutton: మ‌ట‌న్ కొనేప్పుడు ఎక్కువ‌గా మాంసం, లివ‌ర్, కిడ్నీలు తీసుకుంటారు. అయితే తిల్లీలో కూడా ఎన్నో పోష‌కాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు. తిల్లీని ఆరోగ్యంలో భాగం చేసుకోవ‌డం ద్వారా ఎన్నోలాభాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఐరన్, ప్రోటీన్ పవర్ – రక్తహీనతకు చెక్

మటన్ తిల్లీలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఐరన్ వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఇది సహాయకారి. శరీరంలో అలసట, బలహీనత తగ్గించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్ కండరాల బలానికి, శరీర నిర్మాణానికి మద్ధతు ఇస్తుంది. రోజూ శారీరక శ్రమ చేసే వారికి ఇది మంచి ఆహారం.

25
రోగనిరోధక శక్తి, శరీర మరమ్మత్తు

తిల్లీలో విటమిన్ B12, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. తెల్ల రక్త కణాల వృద్ధికి మద్ధతు ఇస్తాయి. ఇంకా కణజాల మరమ్మత్తు, శరీరంలో దెబ్బతిన్న కణాలను పునరుద్ధరించడంలో కీలకంగా పనిచేస్తుంది. అందువల్ల గాయాలు త్వరగా మానడానికి కూడా సహకరిస్తుంది.

35
కొన్ని ఆరోగ్య సమస్యల్లో ఉపయోగం

కొన్ని వైద్య పరిశోధనల ప్రకారం తిల్లీ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల్లో ఉపశమనం లభించవచ్చు. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు, చర్మ అలర్జీలు, కిడ్నీ సమస్యలు, శరీర బలహీనత వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. చిన్నపిల్లల్లో హిమోగ్లోబిన్ పెరగడానికి, పెద్దవారిలో రక్త స్థాయిలు మెరుగుపడడానికి ఇది ఉపయోగపడుతుంది. గర్భిణులు, బాలింతలకు కూడా డాక్టర్ల సలహాతో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

45
తిల్లీ క‌ర్రీ ఎలా చేసుకోవాలి.?

ముందుగా తిల్లీని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాసన తగ్గించేందుకు బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క వేసిన మరిగిన నీటిలో ఒక నిమిషం ఉంచాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఈ ముక్కలను వేసి నెమ్మదిగా వేయించాలి. నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపితే రుచికరమైన తిల్లీ ఫ్రై రెడీ అవుతుంది. కర్రీగా చేసుకోవాలంటే ఉల్లిపాయలు, మసాలా పేస్ట్, కొబ్బరి కలిపి గ్రేవీలా ఉడికించవచ్చు. సరైన పద్ధతిలో చేస్తే మంచి రంగు, రుచితో వంటకం సిద్ధమవుతుంది.

55
ఎంత తినాలి? జాగ్రత్తలు ఏంటి.?

తిల్లీ ఆరోగ్యానికి మంచిదే కానీ పరిమితంగా తీసుకోవాలి. అధికంగా తింటే కొందరికి జీర్ణ సమస్యలు రావచ్చు. శుభ్రంగా కడిగి, సరిగా వండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories