Food: ప్ర‌పంచంలో టాప్ 100 వంట‌కాల్లో.. భార‌త్‌కు చెందిన 6 వంట‌కాల‌కు చోటు

Published : May 03, 2026, 12:19 PM IST

Food: ఒక్కో ప్రాంతంలో ఒక్కో టూరిస్టు ప్ర‌దేశాలు ఉన్న‌ట్లే. ఆయా ప్రదేశాల్లో ప్ర‌త్యేక ఆహారం కూడా ఉంటాయి. ఆ ఆహారం ప్రాంతానికి ప్ర‌త్యేక గుర్తింపును తీసుకొస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టేస్ట అట్లాస్ ప్ర‌పంచంలో టాప్ 100 వంట‌కాల జాబితాను విడుద‌ల చేసింది.

PREV
15
ప్రపంచ టాప్ 100లో భారతీయ చికెన్ వంటలు

భారతదేశం రుచికరమైన వంటకాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. తాజాగా TasteAtlas విడుదల చేసిన ప్రపంచ టాప్ 100 చికెన్ వంటకాల జాబితాలో భారతదేశానికి చెందిన 6 వంటలు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాను ప్రపంచవ్యాప్తంగా వేలాది ఫుడ్ రివ్యూల ఆధారంగా రూపొందించారు. దీంతో భారతీయ వంటకాల ప్రత్యేక రుచులు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి.

25
టాప్1లో బ‌ట‌ర్ చికెన్

ఈ జాబితాలో భారతదేశం నుంచి అత్యుత్తమ స్థానం పొందిన వంటకం బట్టర్ చికెన్. ఇది 6వ స్థానంలో నిలిచింది. ఈ వంటకం ఢిల్లీలోని ప్రసిద్ధ ‘మోతి మహల్’ రెస్టారెంట్‌లో ప్రారంభమైంది. టమాటో, వెన్న, క్రీమ్‌తో తయారయ్యే మృదువైన గ్రేవీ ఇందులో ప్రధాన ఆకర్షణ. తందూరి చికెన్ ముక్కలను ఈ గ్రేవీలో కలిపి వండుతారు. దీని రుచి తేలికగా, క్రీమీగా ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడుతారు.

35
తందూరి ముర్గ్, చికెన్ 65 – స్పెషల్ ఫ్లేవర్స్

ఈ జాబితాలో 22వ స్థానంలో ఉన్న తందూరి ముర్గ్ పంజాబ్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ వంటకం. చికెన్‌ను దహీ, మసాలాల్లో నానబెట్టి తందూర్‌లో కాల్చడం ద్వారా ప్రత్యేకమైన స్మోకి రుచి వస్తుంది. అలాగే 27వ స్థానంలో నిలిచిన చికెన్ 65 చెన్నైకి చెందిన స్పైసీ స్టార్టర్. దీన్ని డీప్ ఫ్రై చేసి, కరివేపాకు, మిర్చి ఎక్కువగా వేసి తయారు చేస్తారు. ఇది చాలా కారంగా, క్రిస్పీగా ఉంటుంది.

45
ముర్గ్ టిక్కా, కాఠీ రోల్ – స్ట్రీట్ ఫుడ్ హిట్

53వ స్థానంలో ఉన్న ముర్గ్ టిక్కా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వంటకం. ఇది బోన్ లెస్‌ చికెన్ ముక్కలను సీక్‌పై పెట్టి గ్రిల్ చేసి తయారు చేస్తారు. స్నాక్‌గా ఎక్కువగా తింటారు. 70వ స్థానంలో ఉన్న చికెన్ కాఠీ రోల్ కోల్‌కతాకు చెందిన స్ట్రీట్ ఫుడ్. పరాఠాలో చికెన్, ఉల్లిపాయలు, చట్నీ వేసి రోల్‌గా తయారు చేస్తారు. ఇది తేలికగా తినడానికి అనువుగా ఉంటుంది.

55
ముర్గ్ రెజాలా – శాహీ రుచుల ప్రతీక

ఈ జాబితాలో 96వ స్థానంలో నిలిచిన ముర్గ్ రెజాలా బెంగాల్ ప్రాంతానికి చెందిన శాహీ వంటకం. ఇది తెల్లని గ్రేవీతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో పెరుగు, కాజూ పేస్ట్, సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. దీని రుచి మృదువుగా, రిచ్‌గా ఉంటుంది. ఈ వంటకాలన్నీ భారతీయ వంటకాల్లోని వైవిధ్యాన్ని, రుచుల గొప్పతనాన్ని ప్రపంచానికి మరోసారి చాటుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories