హైదరాబాద్ అంటే ఒకప్పుడు పురాతన మొఘలాయి సంస్కృతికి ఫేమస్. ముఖ్యంగా ఇక్కడ వంటకాలు వరల్డ్ వైడ్ ఫేమస్. ఎందుకంటే హైదరాబాదీ వంటకాల్లో వాడే మసాలా, వంట శైలి, అరేబియన్, దక్షిణ భారత రుచుల కలయిక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. విభిన్నమైన వంట విధానం, అందరూ ఇష్టపడే రుచి, సువాసన కలిగి ఉండటం హైదరాబాదీ వంటకాల ప్రత్యేకత. అలాంటి వాటిలో బాగా ఫేమస్ అయిన 7 హైదరాబాదీ వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. హైదరాబాదీ బిర్యానీ
హైదరాబాదును నవాబులు పరిపాలించే కాలంలోనే భారతదేశంలో బిర్యానీ పరిచయం అయింది. బాస్మతి బియ్యం, మెత్తటి మసాలా దినుసులు, రుచికరమైన చికెన్ లేదా మటన్ తో చేసిన ఈ ఫుడ్ ఐటమ్ ని అప్పట్లో రాజుల విందుగా పిలిచేవారు. హైదరాబాదీ దమ్ బిర్యానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్.
2. హలీమ్
రంజాన్ నెలలో హైదరాబాదులో దీన్ని తినకుండా ఏ ఒక్క ఆహార ప్రియుడు ఉండలేరు. కోడి లేదా మటన్, పప్పు, గోధుమలు, మసాలా దినుసులు కలిపి బాగా ఉడికించి చేసే మెత్తటి ఆహారం ఇది.
3. మిర్చి కా సలాన్
హైదరాబాదీ బిర్యానీకి సైడ్ డిష్ గా ఈ ఫుడ్ ఐటమ్ ఫేమస్. పచ్చి మిరపకాయలు, వేరుశెనగ, కొబ్బరి కలిపి తయారుచేసే ఒక మెత్తటి, కారంగా ఉండే గ్రేవీ ఇది. దీన్ని సాధారణ అన్నంతో లేదా పరోటాతో కూడా కలిపి తినవచ్చు.
4. బగారా బైంగన్
మెత్తటి కూరలో ఊరిన విలువైన వంకాయ వంటకం ఇది. వేరుశెనగ, కొబ్బరి, మెంతులు, జీలకర్ర, కరివేపాకు కలిపి చేసే ప్రత్యేకమైన సైడ్ డిష్. ఇది అన్నం, పరోటా, రోటీలతో అద్భుతంగా ఉంటుంది.
5. డబుల్ కా మీఠా
బ్రెడ్‌ను వేయించి, పాలు, చక్కెర, యాలకులు, ద్రాక్ష కలిపి తయారుచేసే ఒక అద్భుతమైన స్వీట్ ఇది. దీనిని వేడిగా, చల్లగా కూడా తినవచ్చు. చాలా మంది దీన్ని బ్రెడ్ హల్వా అనుకుంటారు. కాని హైదరాబాదీ స్టైల్ రుచి వేరే లెవెల్ అంతే.
6. ఖుబానీ కా మీఠా
హైదరాబాదీ పెళ్లిళ్లలో తప్పకుండా ఉండే ఒక ప్రత్యేకమైన స్వీట్ ఇది. ఎండిన బాదం పండ్లను చక్కెరలో నానబెట్టి, కస్టర్డ్, క్రీమ్ కలిపి తయారు చేసే అద్భుతమైన డెజర్ట్.
7. ఉస్మానియా బిస్కెట్
హైదరాబాద్ పాత బస్తీలో టీ + ఉస్మానియా బిస్కెట్ తినని వారుండరు. మెత్తటి, చక్కెర కలిగిన, కొంచెం ఉప్పు, కొంచెం తీపి కలిసిన ఈ బిస్కెట్ ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.