Ginger Peeling Tip: అల్లం తొక్క తీయడానికి సింపుల్ చిట్కా ఇదిగో

Published : Mar 21, 2025, 07:08 PM IST

Ginger Peeling Tip: వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. టీ నుండి బిర్యానీ వరకు ప్రతిదానిలో అల్లం ఉపయోగిస్తారు. అల్లం తొక్క తీయడానికి చాలా మంది చాకు వాడతారు. చాకు ఉపయోగించకుండా సింపుల్ గా అల్లం తొక్క ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
15
Ginger Peeling Tip: అల్లం తొక్క తీయడానికి సింపుల్ చిట్కా ఇదిగో

అల్లం తినడం వల్ల శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా కడుపులో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించడానికి అల్లం చాలా సహాయపడుతుంది. అల్లాన్ని పచ్చిగా కూడా నమిలి తినవచ్చు. లేదా అల్లం రసంలో తేనె కలిపి తాగితే కడుపుకు సంబంధించిన అనేక సమస్యలను తీరుస్తుంది. అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉన్నప్పటికీ అల్లం తొక్క తీయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సింపుల్ టిప్స్ ఉపయోగించి అల్లం తొక్కను ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

25

అల్లాన్ని శుభ్రం చేసే విధానం

సాధారణంగా అల్లం కొనేటప్పుడు దానితో మట్టి కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా అల్లాన్ని ఒక గిన్నెలో వేసి నీటితో నింపి కాసేపు నానబెట్టాలి. నీటిలో అల్లం నానిన తర్వాత దానిలోని మట్టిని ఈజీగా శుభ్రం చేయవచ్చు. తర్వాత వంటకు సులభంగా ఉపయోగించవచ్చు.

ఒకవేళ అల్లం కుళ్ళిపోయినట్లయితే దానిని వంటకు ఉపయోగించకుండా ఉండటం మంచిది. నీటిలో కడిగిన అల్లాన్ని బాగా ఆరిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. 

35

ఎలాంటి అల్లాన్ని కొనాలి

అల్లం కొనేటప్పుడు ముందుగా దాని వేర్లు ఎండిపోయి ఉంటే దాన్ని ఎప్పుడూ కొనకండి. ఎందుకంటే అది ఇప్పటికే పొడిగా ఉంటుంది. అందులో నీటి శాతం తక్కువగా ఉంటుంది. కొంచెం తేమగా, ఎక్కువ బరువుతో ఉండే అల్లం ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుంది.

దీన్ని కూడా చదవండి:  ఇది నిజంగా మిరాకిల్ ట్రీ.. మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?

45

అల్లాన్ని ఎలా నిల్వ చేయాలి

తొక్క తీసిన అల్లాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. బాగా ఆరిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి గాలి చొరబడని విధంగా మూసివేయాలి. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టోర్ చేసుకుంటే వంటకు సులభంగా ఉపయోగించుకోవచ్చు.

అల్లాన్ని తొక్క తీయకుండా ఉపయోగించవచ్చా?

కొందరు వంటకు అల్లం తొక్క తీయకుండా నేరుగా ఉపయోగిస్తారు. కానీ అది తప్పు. అల్లం ఫ్రెష్ గా ఉన్నా కూడా దాన్ని బాగా కడిగి శుభ్రం చేసి తొక్క తీసిన తర్వాతే ఉపయోగించాలి. లేదంటే ఆహారం టేస్ట్ మారుతుంది.

 

55

అల్లం తొక్క తీయడానికి ఇది బెస్ట్ టెక్నిక్

అల్లం తొక్క తీయడానికి చాలా మంది చాకు ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల గుజ్జు కూడా తొక్కతో వచ్చే అవకాశం ఉంది. దానికి బదులుగా మీరు స్పూన్ ఉపయోగించి అల్లం తొక్కను చాలా సులభంగా తీసివేయవచ్చు. ఒక స్పూన్‌తో అల్లం తొక్కను పై నుండి క్రిందికి నెమ్మదిగా లాగితే చాలు. అది అలాగే వచ్చేస్తుంది.

అలాగే పీలర్‌తో కూడా అల్లం తొక్కను ఎప్పుడూ తీయకూడదు. దీని వల్ల మీ చేతులకు గాయం అయ్యే అవకాశం ఉంటుంది. 

దీన్ని కూడా చదవండి:  జామకాయతో చట్నీ ఎప్పుడైనా చేశారా? ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది

Read more Photos on
click me!

Recommended Stories