Jeera Water: ఎండాకాలంలో నెలరోజులు జీలకర్ర నీరు తాగితే ఏమౌతుంది?
ఈ జీలకర్రను మరిగించి నీటి రూపంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ జీలకర్రను మరిగించి నీటి రూపంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
జీలకర్రను మనం రెగ్యులర్ గా వంటలో ఉపయోగిస్తూనే ఉంటాం. ఈ జీలకర్ర లో చాలా పోషకాలు ఉన్నాయని, దీనిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయుర్వేదంలో కూడా పేర్కొన్నారు. వంటకు రుచిని పెంచే ఈ జీలకర్ర.. మనకు బరువు తగ్గించడంలోనూ సహాయం చేస్తుందని మీకు తెలుసా? ఈ జీలకర్రను మరిగించి నీటి రూపంలో ముఖ్యంగా ఈ ఎండాకాలంలో నెల రోజులు తీసుకుంటే.. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గించే జీలకర్ర...
జీలకర్ర నీరు తాగడం వల్ల చాలా సులభంగానే బరువు తగ్గవచ్చట.అంతేకాదు.. ఈ జీలకర్ర వాటర తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ నీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి.కాబట్టి.. క్యాలరీలు పెరుగుతాయి అనే భయం అక్కర్లేదు.అయితే.. ఇవి బరువు పెరగకుండా కాపాడటమే కాదు.. మన శరీరంలో కొవ్వును కరిగించడంలోనూ సహాయపడుతుంది.
జీలకర్ర నీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో మంటను తగ్గించే శక్తి ఈ నీటిలో ఉంది.ఉదయం ఖాళీ కడుపుతో వేడి జీలకర్రను మరిగించి, ఆ నీటిని ఫిల్టర్ చేసి త్రాగాలి. దీని కోసం, జీలకర్రను ఒక పాత్రలో వేసి మరిగించాలి. తర్వాత దాన్ని వడకట్టి, వేడిగా ఉన్నప్పుడే తాగాలి.
డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం, బరువు తగ్గాలనుకునే వారికి జీలకర్ర నీరు ఒక గొప్ప ఎంపిక. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే, మీ జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. దీని కోసం, జీలకర్రను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం మరిగించిన తర్వాత, దానిని వడకట్టి త్రాగాలి. ఇది శరీరం నుండి అదనపు కొవ్వును తొలగించడానికి సహాయపడుతుంది.
శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడానికి సహాయపడుతుంది
బరువు తగ్గాలనుకునే వారు జీలకర్ర గింజలతో తయారు చేసిన కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం ద్వారా సమర్థవంతంగా బరువు తగ్గవచ్చు. జీలకర్ర ప్రధానంగా యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరం నుండి టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడుతుంది. జీవక్రియను ప్రేరేపిస్తుంది. ఈ ప్రభావం సమర్థవంతంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది
జీలకర్ర , నీటి కలయిక శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇది గుండె సంబంధిత ప్రమాదాలను తగ్గిస్తుంది.
డయాబెటిస్
జీలకర్ర నీరు మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడమే కాకుండా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. ఈ నీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, ఇది రక్తపోటును సహజంగా నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యానికి మంచిది
జీలకర్ర నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అలాగే, రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ కలయిక మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.జీలకర్ర బరువు తగ్గడానికి, ఆరోగ్య సమస్యలకు మాత్రమే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ జీలకర్ర కషాయం ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఇందులో పొటాషియం, కాల్షియం, సెలీనియం, రాగి , మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని అందంగా మారుస్తాయి.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి మీరు జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం ద్వారా, మీ జీర్ణవ్యవస్థ ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంటుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం మొదలైన సమస్యల నుండి మీరు ఉపశమనం పొందగలుగుతారు.
అందమైన జుట్టు, అందం కోసం జీలకర్ర కషాయం
అధిక బరువు ఉన్న మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనం ఫలితాల ప్రకారం, ప్రతిరోజూ వారి ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను చేర్చుకోవడం వల్ల శరీరం సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ కొవ్వును తగ్గిస్తుంది.ఇది చర్మ సౌందర్యాన్ని పెంచడమే కాకుండా జుట్టు అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీలకర్ర నీటిలో యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది తల చర్మం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టును సిల్కీగా మారుస్తుంది.