mutton
మటన్ ధరలు భారీగా పెరగడంతో కొందరు నాణ్యతలేని మాంసాన్ని వినియోగదారులకు అంటగడుతున్నారు. ముఖ్యంగా కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. అనారోగ్య కారణాలతో మరణించిన గొర్రెలను, మేకలను గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. దీంతో ఇలాంటి మాంసాన్ని తిన్న వారు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందుకే మాంసాన్ని కొనుగోలు చేసే ముందు కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
mutton
మటన్ విక్రయించే దుకాణాల్లో వెటర్నరీ అధికారులు సదరు మాంసం నాణ్యతకు సంబంధించి కొన్ని పరీక్షలు చేస్తారు. నిబంధనల ప్రకారం శానిటరీ ఇన్‌స్పెక్టర్, పశు సంవర్ధక శాఖ వైద్యుడు పరిశీలించిన మాంసాన్నే విక్రయించాలి. అయితే చాలా వరకు దుకాణదారులు ఈ నిబంధనలను పాటించరు. అధికారులు పరిశీలించిన మాంసంపై ఒక ముద్ర వేస్తారు. ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేయడమే మంచిది. మటన్ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వీటిలో ప్రధానమైవి.
mutton
* లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే మాంసాన్ని కొనుగోలు చేయాలి. ఇలాంటి దుకాణాల్లో మాంసాన్ని వైద్యులు పరీక్షించిన తర్వాతే విక్రయిస్తారు.
* రోడ్లపై, మురికి కాలువల పక్కన విక్రయించే మటన్‌ను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు.
* మీరు కొనుగోలు చేస్తున్న మాంసం ఆరోగ్యంగానే ఉందా.? లేదా కుళ్లిపోయిందా.? అన్న విషయాన్ని పరిశీలించాలి.
* మాంసంపై అధికారులు ముద్ర వేసినది మాత్రమే కొనుగోలు చేయాలి.
* మాంసం మరీ గట్టి పడినా, చల్లగా ఉన్నా అలాంటి వాటిని కొనుగోలు చేయకూడదు. దీనర్థం సదరు మాంసాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేశారని.
* మటన్ నుంచి పాడై వస్తున్నా కొనుగోలు చేయకూడదు. ఇక తూకం వేసేప్పుడు కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.