సాధారణంగా మన ఆహారపు అలవాట్లు ప్రతి సీజన్‌కు తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. వేసవిలో శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో చల్లని పదార్థాలు తినాలని, వేడిగా ఉండే ఆహారాలను తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి బలంగా ఉండాలని చాలా రకాల ఆహారాలు తింటున్నారు. డైట్ ఫాలో అవుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఎక్కువ మంది వెల్లుల్లి తింటుంటారు.
వెల్లుల్లిలో ఉండే పోషకాలు
వెల్లుల్లి వంటగదిలో ఉపయోగించే ఒక ముఖ్యమైన పదార్థం. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఉన్నాయి.
అలాగే వెల్లుల్లిలో ఐరన్, కొవ్వు, ప్రోటీన్లు కూడా ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే పోషకాలు మనల్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి సహాయపడతాయి. శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్ చేస్తాయి.
వెల్లుల్లి ఉపయోగాలు
వెల్లుల్లి మన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వాటికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా అధిక రక్తపోటును తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వెల్లుల్లి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అలర్జీ, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలు తలనొప్పి, మతిమరుపు, దంతాల నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఇది కూడా చదవండి: ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే ఇన్ని లాభాలా?
వేసవిలో వెల్లుల్లిని ఉపయోగించవచ్చా?
ఎప్పటిలాగే వేసవిలో కూడా వెల్లుల్లిని అదేవిధంగా ఉపయోగించవచ్చా? అనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది. వేసవిలో వెల్లుల్లిని అవసరమైన మేరకు తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో శరీర ఉష్ణోగ్రతను పెంచే గుణాలు ఉన్నాయి. కాబట్టి వేసవిలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే అలర్జీ వంటి కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వేసవిలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే శరీర వేడి పెరిగి అసౌకర్యంగా ఉంటుంది.
అలాగే వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కాంపోజిషన్ ఉండటం వల్ల దీన్ని ఎక్కువగా తీసుకుంటే లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లిని వేసవిలో తినడం అంత మంచిది కాదు. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ వేసవిలో దీన్ని ఎక్కువగా తింటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయని గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి: అల్లం తొక్క తీయడానికి సింపుల్ చిట్కా ఇదిగో