ఇడ్లీ బరువు తగ్గడానికి చాలా మంచిది. కానీ కొంతమందికి ఇడ్లీ నచ్చకపోవచ్చు. ఇలాంటి వారు దోశను తినొచ్చు. కాకపోతే పెసర్లు, ఓట్స్, రాగులను దోశ పిండిలో కలపండి. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచి మీరు హెవీగా తినకుండా చేస్తాయి.
దోశ, ఇడ్లీ రెండింటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలా మంచివి. కానీ బరువు తగ్గడానికి ఇడ్లీలే మంచివి. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు తక్కువ నూనె వేసి దోశను తింటే కూడా బరువు తగ్గుతారు. కానీ దోశ కన్నా ఇడ్లీనే వెయిట్ లాస్ కు మంచిది.