Kiwi: కివి పండు తినే అలవాటు ఉందా? విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ పండు.. పురుషుల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మీకు తెలుసా? రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యను కూడా తగ్గించే అవకాశం ఉంది.
నేటి తరం యువతలో చాలా మంది సంతానలేమి సమస్య ( Infertility) తో బాధపడుతున్నారు. ఇది కేవలం మహిళల్లోనే కాకుండా, పురుషుల్లో కూడా సమానంగా కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు కూడా వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గడానికి కారణం అవుతున్నాయని నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే... ప్రకృతి మనకు ఇచ్చిన కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్యలను తగ్గించగలవు. వాటిలో కివీ పండు చాలా కీలక పాత్ర పోషిస్తుంది.
25
కివీ పండులో అద్భుత గుణాలు....
చూడటానికి చిన్నగా, ఆకుపచ్చ రంగులో ఉండే ఈ కివి... విటమిన్ సి మంచి సోర్స్ అని చెప్పొచ్చు. ఒక్క కివీ పండులో మిగిలిన పండ్ల కంటే మూడు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
35
టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచే కివీ..
కివీ పండులో ఉన్న జింక్, ఫోలేట్, కాల్షియం వంటి ఖనిజాలు పురుషుల టెస్టోస్టెరాన్ స్థాయిని సహజంగా పెంచుతాయి. ఇది పురుషుల శక్తి , సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి.
వీర్య కణాల సంఖ్య , నాణ్యత పెంచే కివీ..
కివీలో లభించే ఆక్టినిడిన్, విటమిన్ E, జింక్ వంటి ఖనిజాలు వీర్య కణాల ఉత్పత్తిని, వాటి చలనశీలతను (motility) పెంచుతాయి. వీర్య కణాలు బలంగా, చురుకుగా ఉండేలా చేస్తాయి. దీంతో గర్భధారణ అవకాశాలు కూడా పెరుగుతాయి.
NCBI పరిశోధన ప్రకారం, యాంటీఆక్సిడెంట్లు వీర్య కణాల నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కివీ పండు ఈ యాంటీఆక్సిడెంట్లకు సమృద్ధిగా నిలయంగా ఉంటుంది. దీన్ని తరచుగా తినడం ద్వారా శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి, వీర్య కణాల సంఖ్య పెరగడానికి కూడా సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది..
కివీ పండులో ఉన్న విటమిన్ C మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒత్తిడి వీర్య కణాల నాణ్యతను తగ్గించే ప్రధాన కారణం ఈ ఒత్తిడి కాబట్టి, దీన్ని తగ్గించడం ద్వారా సహజంగానే ఫెర్టిలిటీ మెరుగుపడే అవకాశం ఉంది.
55
రోజుకు ఒక కివీతో మార్పు
రోజుకు ఒకటి లేదా రెండు కివీ పండ్లు తినడం ద్వారా పురుషులు తమ శరీరంలో సంతానోత్పత్తి సంబంధిత హార్మోన్ల సమతుల్యతను పొందగలరు. అలాగే శరీరానికి అవసరమైన ఫోలేట్, విటమిన్ E, జింక్ వంటి పోషకాలు అందుతాయి.
ఫైనల్ గా...
కివీ పండు పురుషుల ఆరోగ్యానికి సహజ పరిష్కారం. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా వీర్య కణాల నాణ్యత, టెస్టోస్టెరాన్ స్థాయి, మానసిక శాంతి అన్నీ మెరుగుపడతాయి.