ఈ ఇడ్లీలను పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు.. చేయడం కూడా చాలా ఈజీ!

Published : Sep 01, 2025, 03:53 PM IST

చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా చేసే టిఫిన్ ఇడ్లీ. చిన్నా, పెద్దా వీటిని ఇష్టంగా తింటారు. రుచిగా ఉంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది. కానీ రోజూ ఒకే రకమైన ఇడ్లీ తింటే బోర్ కొడుతుంది కదా. నిజానికి ఇడ్లీల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. అందులో కొన్ని మీకోసం.

PREV
15
అటుకుల ఇడ్లీ

పోహా లేదా అటుకుల ఇడ్లీ చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పోహా, బియ్యం, మినుముల మిశ్రమంతో తయారు చేయవచ్చు. లేదా డైరెక్ట్ పోహా తో కూడా తయారు చేసుకోవచ్చు. అందుకోసం ఒక 15 నిమిషాలు పోహాను నానబెట్టాలి. నీళ్లు తీసేసి పోహాను మిక్సి పట్టాలి. అందులో కొంచెం పెరుగు, ఉప్పు, వంట సోడా కలిపి ఇడ్లీ చేసుకోవచ్చు. పోహా ఇడ్లీ కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది.

25
రవ్వ ఇడ్లీ

రవ్వ ఇడ్లీని త్వరగా చేసుకోవచ్చు. అందుకోసం రవ్వలో కొంచెం పెరుగు, వంట సోడా కలిపి పావుగంట పాటు పక్కనపెట్టాలి. ఆ తర్వాత ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఇవి కాస్త గరుకుగా ఉంటాయి. కానీ చాలా రుచిగా ఉంటాయి. పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో వీటిని తినవచ్చు. పిల్లలకు బాగా నచ్చుతాయి.

35
కాంచీపురం ఇడ్లీ

కాంచీపురం ఇడ్లీ చాలా ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బీ.. రాత్రంతా పులియబెట్టాలి. అందులో నెయ్యిలో వేయించిన కరివేపాకు, ఇంగువ, జీలకర్ర, మిరియాలు, అల్లం వంటి మసాలా దినుసులు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆవిరిపై ఉడికించుకోవాలి. వీటిని చట్నీ లేదా సాంబార్ తో తింటే సూపర్ గా ఉంటాయి.

45
ఓట్స్ ఇడ్లీ

ఓట్స్ ఇడ్లీ రుచిగా ఉంటాయి. పోషకాలతో నిండి ఉంటాయి. ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఓట్స్ ఇడ్లీ తయారు చేయడానికి.. ముందుగా ఓట్స్ ని వేయించి పొడి చేసుకోవాలి. అందులో పెరుగు, రవ్వ, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి పిండి ప్రిపేర్ చేసుకోవాలి. వీలైతే కాసేపు పక్కన పెట్టుకోవచ్చు. లేదా వెంటనే ఇడ్లీ తయారు చేసుకోవచ్చు. ఓట్స్ ఇడ్లీ కొబ్బరి చట్నీ, సాంబార్ తో బాగుంటుంది. పిల్లలకు బాగా నచ్చుతుంది.

55
స్టఫ్ఫింగ్ ఇడ్లీ

స్టఫ్ఫింగ్ ఇడ్లీ తయారు చేయడానికి ముందుగా బియ్యం, మినపప్పు మిశ్రమంతో పిండిని సిద్ధం చేసుకోవాలి. పిండిని ఇడ్లీ పాత్రలో వేసేటప్పుడు కాస్త పిండి వేసి మధ్యలో మసాలా దట్టించిన బంగాళాదుంపలు, లేదా కూరగాయలను వేసి మళ్లీ పైన పిండి వేయాలి. తర్వాత ఆవిరిపై ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి. అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి.

Read more Photos on
click me!

Recommended Stories